Police - Vishvambhara News

పోలీసింగ్‌లో యువత భాగస్వామ్యం.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ముందడుగు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరబాద్ నగర పోలీసులు సరికొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. విద్యావంతులైన యువతలోని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాన్ని పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు 'ఇంటర్న్‌షిప్', 'ప్రొఫెషనల్ వాలంటీర్' ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. దీని ద్వారా అటు విద్యార్థులకు ప్రభుత్వ పరిపాలనపై అవగాహన, ఇటు పోలీస్ శాఖకు నూతన దృక్పథం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఎస్‌ఎమ్‌ఐటీ సెల్ ద్వారా కొనసాగుతుంది.

ఇంటర్న్‌షిప్ అర్హతలు - బాధ్యతలు
ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. 25 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టులు, ఆధునిక పోలీసింగ్ పద్ధతులకు సంబంధించిన పనులను కేటాయిస్తారు. ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన వారికి హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అధికారిక సర్టిఫికెట్ అందజేస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా, వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులు కూడా 'వాలంటీర్'గా చేరి సాంకేతిక లేదా ప్రక్రియ ఆధారిత పనుల్లో పోలీసులకు సహకరించవచ్చు.

సరికొత్త ఆలోచనలకు వేదిక
ఈ అంశంపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. విద్యార్థులు పోలీసు అధికారులతో కలిసి పనిచేస్తూ, విభాగపు పనితీరులో సరికొత్త ఆలోచనలను జోడించడానికి ఇదొక చక్కని వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు విలువైన అనుభవం లభిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు హైదరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ www.hyderabadpolice.gov.in సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా నేర పరిశోధన, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా పోలీసింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవచ్చని పోలీస్ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కేసు నమోదుపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డిలో దొంగ ఓట్లను అడ్డుకున్న కాంగ్రెస్ నేతపై సీఐ చేయిచేసుకున్నారని ఆయన ఆరోపించారు. తమ నేతను కొట్టినందుకే సీఐని తిట్టాల్సి వచ్చిందని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. సీఐ శివకుమార్ బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉండాలని ఆయన అన్నారు. నిన్న జరిగిన ఘటనలో తప్పు ఎవరిదనేది న్యాయస్థానంలో తేలుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల బదిలీలు!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో పోలీస్ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. ఐదుగురు డీఎస్పీ (DSP) స్థాయి అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, సంబంధిత అధికారులు తమ పాత పోస్టింగ్ నుంచి రిలీవ్ అయి కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీజీపీఏ స్టాండ్స్‌లో డీఎస్పీగా, ఇల్లందు ఎస్‌డీపీఓగా విధులు నిర్వహిస్తున్న సారంగపాణిని ఖమ్మం జిల్లా వైరా ఏసీపీగా బదిలీ చేశారు. దీంతో ఆయన ఇల్లందు ఎస్‌డీపీఓ పోస్టింగ్ రద్దయ్యింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో డీఎస్పీగా ఉన్న పద్మనాభుల శ్రీనివాస్‌ను.. వైరా ఏసీపీ పోస్టు నుంచి తొలగించి, జీహెచ్‌ఎంసీ అదనపు ఎస్‌పీ ఖాళీ పోస్టులోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా ఉన్న యు. వెంకన్న బాబును ఇల్లందు ఎస్‌డీపీఓగా నియమించారు.  సైబరాబాద్‌లో ఏసీపీ (ఎస్‌బీ)గా పనిచేస్తున్న ప్రకాశ్‌ను నిజామాబాద్ (టీ) ఏసీపీగా బదిలీ చేశారు. నిజామాబాద్ (టీ) ఏసీపీగా ఉన్న వెంకట్ రెడ్డిని హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరంతా విధుల్లో చేరిన తర్వాత సీటీసీ నివేదికలు సమర్పించాలని సూచించారు.

ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మీడియా రంగంలో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు వార్తా సంస్థ 'ఎన్టీవీ' (NTV) కి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (CCS) పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అదేవిధంగా, ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణా చారి, సుధీర్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది..?
గత వారం (జనవరి 8న) ఎన్టీవీలో ప్రసారమైన ఒక వార్తా కథనం ఈ అరెస్టులకు ప్రధాన కారణమైంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఒక మహిళా ఐఏఎస్ (IAS) అధికారిణి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ ఆ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిత్వ హననం చేసే ఉద్దేశంతోనే ఈ తప్పుడు కథనాన్ని ప్రసారం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తమ సహోద్యోగిపై సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరిగిన ఈ దుష్ప్రచారాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు జనవరి 10న ఐఏఎస్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు FIR నమోదు చేశారు. తప్పుడు సమాచారంతో మహిళా అధికారిణి ప్రతిష్ఠకు భంగం కలిగించారనే అభియోగాలపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది.

అరెస్టైన దొంతు రమేష్, పరిపూర్ణా చారి, సుధీర్‌లను పోలీసులు జనవరి 14న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, సీఈవో రాజశేఖర్ ప్రస్తుతం అందుబాటులో లేరని, వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనధికారిక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.

పోలీసులపై దాడి.. మియాపూర్‌లో 144 సెక్షన్ అమలు
మియాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నేటి నుంచి 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ అవినాష్ మహంతి హెచ్చరించారు. మియాపూర్ హెచ్ఎండీఏ వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు డ్రోన్‌తో గస్తీ కాస్తున్నారు. కాగా, మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

సంగీత, సీత అనే మహిళ ఇతర మహిళలను ఉసిగొల్పి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు యత్నించి స్థానిక ఫంక్షన్ హాల్స్‌లో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా, మొత్తం పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్‌తో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తాగునీటిలో డెడ్ బాడీ.. పోలీసులు వచ్చి చూస్తే షాక్..!
విశ్వంభర, హనుమకొండః తాగు నీటిలో డెడ్ బాడీ స్థానికులను కనిపించింది. నీటిపై తేలియాడుతోండి. దాదాపు 12 గంటలు అక్కడే ఆ డెడ్ బాడీ ఉండటంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా పోలీసులు అక్కడకు వచ్చి చూస్తే వాళ్లకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఎందుకంటే అతను చనిపోలేదు.. బతికే ఉన్నాడు.

హనుమకొండ లోని రెడ్డిపురం కోవెలకుంటలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల దాకా నీటిలోనే పడుకున్నాడు. కానీ అతను చనిపోయాడేమో అని భావించిన స్థానికులు కేయూ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు వచ్చి అతను చనిపోయాడేమో అని అతని చేయి పట్టుకుని లాగారు.

కానీ అతను బతికే ఉన్నాడు. దాంతో అందరూ షాక్ అయిపోయారు. అసలు నీటిలో ఎందుకు పడుకున్నావ్ అని అడిగితే.. రోజూ గ్రానైట్ కంపెనీల్లో 12 గంటలు ఎండకు పని చేసి తట్టుకోలేకపోయానని.. చల్లదనం కోసమే నీటిలో పడుకున్నానని తెలిపాడు. ఆయనది నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆయనకు తిరిగి వెళ్లడానికి డబ్బులు ఇచ్చి పంపించేశారు.

కరీంనగర్‌ వివాదంలో ట్విస్ట్.. కత్తి తిప్పి రచ్చ చేసిన వ్యక్తి ఎవరంటే..?
కరీంనగర్‌లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. హనుమాన్ శోభాయాత్రలో అగంతకుడు సృష్టించిన గొడవ, లాఠీచార్జ్‌ చేయడంతో పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్ దీక్ష స్వాములు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు హనుమాన్ దీక్ష స్వాములతో పాటు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.

అయితే హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని సమాచారం. అతడు శోభాయాత్రలో కత్తి తిప్పగా వేరే మతానికి చెందిన వ్యక్తిగా భావించి హనుమాన్ భక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న జయదేవ్ స్థానిక బీజేపీ కార్యకర్త అని, బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణకు అనుచరుడని పోలీసులు తేల్చారు.

అయితే ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వ్యక్తి అని హనుమాన్ భక్తులను  బీజేపీ శ్రేణులు ఉసిగొలిపి రాద్దాంతం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, హనుమాన్ భక్తుల, బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసుల తీరుపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన కరీంనగర్‌కు బయలుదేరిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలేం జరిగిందో తెలుసుకుని డీజీపీతో ఫోన్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది.

కరీంనగర్ వివాదంలో ట్విస్ట్!

నిన్న హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్తే!

నిన్న కరీంనగర్ హనుమాన్ శోభాయాత్రలో ఓ వ్యక్తి వెళ్లి కత్తి తిప్పగా వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకోని దాడి చేసిన హనుమాన్ భక్తులు.

పోలీసుల అదుపులో ఉన్న జయదేవ్ స్థానిక బీజేపీ నాయకుడు… pic.twitter.com/CD9OVEIORq

— Telugu Scribe (@TeluguScribe) May 26, 2024