Karimnagar - Vishvambhara News

మాజీ మేయర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపణలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, 38వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దేశబోయిన హారిక కౌంటింగ్ కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు. బీజేపీ అభ్యర్థి, మాజీ మేయర్ సునీల్ రావు అధికారులను బెదిరిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 'తమ ప్రత్యర్థులైతే గెలవాలి.. మీ సంగతి చెబుతాను.. మీకు వాళ్లు ఏమైనా ఇచ్చారా..?' అంటూ సునీల్ రావు అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హారిక పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

మళ్లీ లెక్కించాలని డిమాండ్
కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న పోలీసులు మాజీ మేయర్‌కు వంత పాడుతున్నారని హారిక ఆరోపించారు. అధికారుల తీరును నిలదీసినా పోలీసులు స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను 38వ డివిజన్‌లో గెలిచినా, ఓడినా అభ్యంతరం లేదని, కానీ తమ డివిజన్‌కు సంబంధించిన ప్రతి ఒక్క ఓటును మళ్లీ లెక్కించాలని ఆమె ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు.

కరీంనగర్ కోటపై కాషాయ జెండా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ వేదికగా బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ రికార్డు సృష్టించింది. ఈ విజయంతో కరీంనగర్ నగరం కాషాయమయమైంది. ఫలితాల అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ మాట్లాడారు. ఈ విజయం అవినీతి రహిత పాలనకు, నరేంద్ర మోదీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. ఓటుకు రూ.7 వేలు పంచినా ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని బండి సంజయ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగురవేస్తాం
కరీంనగర్ తీర్పు స్పూర్తితో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌పై కూడా కాషాయ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒవైసీ బ్రదర్స్ కళ్లలో ఆనందం చూడటానికే రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి, ఒక ముక్కను మజ్లిస్‌కు రాసిచ్చారని విమర్శించారు. ఈ విభజనే రేవంత్ రెడ్డి పాలిట రాజకీయ మరణశాసనం కాబోతోందని, హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ బీఆర్ఎస్‌కు కన్ను కొడుతున్న ఎంఐఎంకు ప్రజలు చెంపచెళ్లుమనిపించే తీర్పు ఇచ్చారని, ఆ పార్టీ కార్యాలయం ఉన్న డివిజన్‌లోనే బీజేపీ జెండా పాతామని గుర్తు చేశారు.

రూ.1,500 కోట్లతో అభివృద్ధి
కరీంనగర్ అభివృద్ధి విషయంలో విపక్షాలు చేసిన విమర్శలను బండి సంజయ్ తిప్పికొట్టారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే నగరాభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు కేటాయించిందని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క నయాపైసా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తాను సామాన్య కార్యకర్తను.. ఎమ్మెల్యేగా ఓడినా, కార్పొరేటర్‌గా, ఎంపీగా తనను గెలిపించి ఈ స్థాయికి తెచ్చిన కరీంనగర్ ప్రజలకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని అన్నారు. ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధిని చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు.

అవినీతికి తావులేకుండా కార్పొరేషన్ ప్రక్షాళన చేస్తానని, పాలనను నేరుగా ప్రజల వద్దకే తీసుకువెళ్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గెలిచిన 33 మంది బీజేపీ అభ్యర్థులతో పాటు, మద్దతు తెలుపుతున్న స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని కలుపుకుని నగరాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ అద్భుత విజయాన్ని తాను నమ్ముకున్న మహాశక్తి అమ్మవారికి అంకితం ఇస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.

ఎమెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తోపులాట
విశ్వంభర, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా  కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమీక్ష రసాభాస అయింది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకోబోయారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. సంజయ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇదే అంశాన్ని కౌశిక్ రెడ్డి నేటి మంత్రుల సమీక్షలో ప్రస్తావించారు.

నువ్వు ఏ పార్టీ తరఫున గెలిచావు? ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లావు?... అసలు నీ పార్టీ ఏది? అంటూ కౌశిక్ రెడ్డి... సంజయ్ పై మండిపడ్డారు. దాంతో, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్లింది. దాంతో అక్కడున్న నేతలు కౌశిక్ రెడ్డిని నిలువరించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సమీక్ష నుంచి బయటికి తీసుకెళ్లారు.

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. రోడ్డుకు అడ్డంగా గోడకట్టిన తండ్రి
ఇటీవల యువత ప్రేమించిన వారికోసం దేనికైనా సిద్ధమవుతున్నారు. కన్నవారు కాదన్నా ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, గారాల ముద్దుగా పెంచుకున్న కూతురు తన మాట వినకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి అందరూ ఆశ్చర్యపోయే పనిచేశాడు. పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లకుండా ఏకంగా రోడ్డుకు అడ్డంగా గోడనే కట్టేశాడు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో మమత అనే యువతి అదే గ్రామానికి చెందిన రత్నాకర్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. రత్నాకర్ ఇల్లు వారి ఇంటి సమీపంలోనే ఉంటుంది. వారి ఇంటికి వెళ్లాలంటే మమత ఇంటి ముందు నుంచే వెళ్లాలి. పెళ్లి తర్వాత మమత తల్లిదండ్రుల ఇంటి ముందు నుంచే వెళ్లాల్సివస్తుంది. దీంతో కోపంతో మమత తండ్రి రత్నాకర్ ఇంటికి అడ్డంగా రోడ్డుపై గోడ కట్టేశాడు. ఇది చూసిన స్థానికులు నివ్వెరపోతున్నారు.

కరీంనగర్‌ వివాదంలో ట్విస్ట్.. కత్తి తిప్పి రచ్చ చేసిన వ్యక్తి ఎవరంటే..?
కరీంనగర్‌లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. హనుమాన్ శోభాయాత్రలో అగంతకుడు సృష్టించిన గొడవ, లాఠీచార్జ్‌ చేయడంతో పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్ దీక్ష స్వాములు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు హనుమాన్ దీక్ష స్వాములతో పాటు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.

అయితే హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని సమాచారం. అతడు శోభాయాత్రలో కత్తి తిప్పగా వేరే మతానికి చెందిన వ్యక్తిగా భావించి హనుమాన్ భక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న జయదేవ్ స్థానిక బీజేపీ కార్యకర్త అని, బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణకు అనుచరుడని పోలీసులు తేల్చారు.

అయితే ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వ్యక్తి అని హనుమాన్ భక్తులను  బీజేపీ శ్రేణులు ఉసిగొలిపి రాద్దాంతం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, హనుమాన్ భక్తుల, బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసుల తీరుపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన కరీంనగర్‌కు బయలుదేరిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలేం జరిగిందో తెలుసుకుని డీజీపీతో ఫోన్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది.

కరీంనగర్ వివాదంలో ట్విస్ట్!

నిన్న హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్తే!

నిన్న కరీంనగర్ హనుమాన్ శోభాయాత్రలో ఓ వ్యక్తి వెళ్లి కత్తి తిప్పగా వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకోని దాడి చేసిన హనుమాన్ భక్తులు.

పోలీసుల అదుపులో ఉన్న జయదేవ్ స్థానిక బీజేపీ నాయకుడు… pic.twitter.com/CD9OVEIORq

— Telugu Scribe (@TeluguScribe) May 26, 2024