Mahatma Jyotirao Phule Gurukulam - Vishvambhara News

గురుకుల సిబ్బంది చేతివాటంపై చర్యలు తీసుకోవాలి: రాచపల్లి సూర్యప్రకాష్
Anantapur News: అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా సహాయ కార్యదర్శి రాచపల్లి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గురుకుల పాఠశాలల్లో ప్రధానంగా పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని సూర్యప్రకాష్ పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న భోజన సరుకులను పక్కదారి పట్టించడం సరికాదని ఆయన అన్నారు.

జిల్లావ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనేక మంది తల్లిదండ్రులు ఉపాధి కోసం వలసలు వెళ్తూ తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో ఉంచి చదివిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు అందాల్సిన సౌకర్యాలు, భోజనం విషయంలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడితే వారు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని సూర్యప్రకాష్ కోరారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.