elections - Vishvambhara News

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ స్థానాలకు ఫిబ్రవరి 26న అధికారికంగా నోటిఫికేషన్ జారీ కానుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

తెలంగాణలో ఉత్కంఠ.. రేసులో కీలక నేతలు
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుంది. వీరిలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కేఆర్ సురేష్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన సింఘ్వి పదవీకాలం కూడా ఇప్పుడు ముగియనుంది. ఈ రెండు స్థానాలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి ఈ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తుండగా, ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ముగియనున్న ప్రముఖుల పదవీకాలం
కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా మహారాష్ట్ర (7), తమిళనాడు (6), బీహార్ (5), పశ్చిమ బెంగాల్ (5) వంటి రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. శరద్ పవార్, రామ్ దాస్ అథవాలే, ప్రియాంక చతుర్వేది వంటి హేమాహేమీల పదవీకాలం కూడా ఈ ఏప్రిల్‌తోనే ముగియనుండటంతో ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రంలో ఉన్న ఎన్డీయే కూటమి తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తుండగా, 'ఇండియా' కూటమి సభ్యులు గరిష్ట స్థానాలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. మార్చి 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 330కి పైగా అభ్యర్థులు పోటీలో నిలిచారని, ప్రజల నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించిందని పార్టీ నేతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ రెండు చోట్ల విజయం సాధించి ఖాతా తెరిచింది. మంచిర్యాల కార్పొరేషన్‌లో 34వ డివిజన్ నుండి పోటీ చేసిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అగ్గు సాగర్ 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు నుండి పోటీ చేసిన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే పార్టీ నాయకులు, శ్రేణులు, వీర మహిళలు ఎంతో కష్టపడి పనిచేశారని కొనియాడారు. వారి కృషికి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తరుపున, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తమను గుర్తించి ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో మరింత బలం
తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, రెండు చోట్ల గెలవడం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో కూడా బలంగా పోటీ చేస్తామని వెల్లడించారు. సినీ నటుడు ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, జనసేన పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా పాలనకు దక్కిన గౌరవం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసాన్ని చాటిచెప్పాయని ఆయన పేర్కొన్నారు. ఈ అఖండ విజయాన్ని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం అంకితం చేశారు. ''భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. కార్యకర్తల శ్రమ, పార్టీ పట్ల వారికున్న అనంతమైన అభిమానమే నేడు కాంగ్రెస్ ప్రభంజనానికి కారణం." అని రేవంత్ రెడ్డి కొనియాడారు.

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ఆమోదం
రాష్ట్రంలో గత రెండేళ్లుగా సాగుతున్న ‘ప్రజా పాలన’కు ఈ తీర్పు ఒక సాక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణకు ప్రజలు ఈ ఓటు ద్వారా తమ సంపూర్ణ ఆమోదాన్ని తెలిపారని వివరించారు. ఈ తీర్పు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.

ఈ విజయోత్సాహంతో ఆగిపోకుండా, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. నగరాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని, ఈ మద్దతును స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

ముగిసిన తెలంగాణ మున్సిపల్ పోరు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రజాస్వామ్య పండుగ, సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. అయితే, ప్రశాంతంగా మొదలైన పోలింగ్ సమయం గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తలెత్తిన వాగ్వాదాలు, ఘర్షణలు చివరకు పోలీసుల జోక్యానికి దారితీశాయి. చాలా చోట్ల రాజకీయ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు పోలింగ్ వాతావరణాన్ని వేడెక్కించాయి.

ఈ ఎన్నికల ప్రచార పర్వం నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. గెలుపు కోసం ప్రతి పార్టీ తమ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం నిర్వహించాయి. అభివృద్ధి హామీల కంటే ప్రత్యర్థులపై విమర్శలు, సవాళ్లు, వ్యక్తిగత ఆరోపణలే ఎక్కువగా వినిపించాయి. తిట్లపురాణం స్థాయికి చేరుకున్న ఈ రాజకీయ పోరులో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2582 వార్డుల్లో 12 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 2569 వార్డుల్లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ జరిగింది. అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 414 వార్డులకు గాను 2 ఏకగ్రీవం కాగా, మిగిలిన 412 వార్డుల్లో ప్రజలు తమ తీర్పును నిక్షిప్తం చేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

కరీంనగర్ లో లాఠీచార్జి
అన్ని ప్రాంతాల కంటే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించాయి. కరీంనగర్‌లోని 58వ డివిజన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా రణరంగాన్ని తలపించాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడం పెను దుమారానికి దారితీసింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సుమారు ఆరుగురు కార్యకర్తల చేతులు విరిగిపోయినట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ సైతం పోలీసుల లాఠీదెబ్బలకు గురికావడం గమనార్హం. బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తుంటే, ఫిర్యాదు చేసిన తమపైనే పోలీసులు దాడికి పాల్పడ్డారని బీజేపీ శ్రేణులు జిల్లా పరిషత్ ముందు భారీ నిరసనకు దిగాయి. అదనపు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ, ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

దొంగ ఓట్ల బాగోతం బట్టబయలు
మరోవైపు కరీంనగర్ 34వ డివిజన్‌లోని హుస్సేనీపుర సూఫా కాన్వెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్ల బాగోతం బట్టబయలైంది. ఒక స్వతంత్ర అభ్యర్థి తరఫున దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్న ఎండి మొహీబుద్దీన్, ఎండి నజీబుద్దిన్ అనే యువకులను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ ఖాజా మజారుద్దీన్ స్పందిస్తూ, తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఈ రకమైన కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాల నేపథ్యంలో సదరు బూత్‌లో వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన ఎన్నికల అధికారులను కోరారు. దొంగ ఓట్ల వెనుక మాజీ రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద, అనేక వివాదాలు, ఉత్కంఠభరిత ఘట్టాల మధ్య ముగిసిన ఈ ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయ దిశను ఎలా మారుస్తుందో చూడాలి.

మున్సిపల్ పోరు.. ఎస్‌ఈసీ కార్యాలయంలో సీఈఓ భేటీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ తీరును అధికార యంత్రాంగం పర్యవేక్షించింది. పోలింగ్ ప్రక్రియ అత్యంత వేగంగా, పారదర్శకతతో కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయంలో ఎస్‌ఈసీ రాణి కుముదినితో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల సరళి, ఎదురైన సవాళ్లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు.

ప్రతి అడుగుపై నిఘా..100 శాతం వెబ్ కాస్టింగ్!

ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ 100 శాతం వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. దీని ద్వారా పోలింగ్ కేంద్రం లోపల జరిగే ప్రతి కదలికను ఉన్నతాధికారులు నిరంతరం గమనించారు. ఈ వ్యవస్థ పనితీరును సీఈఓ సుదర్శన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ల ద్వారా వివిధ జిల్లాల్లోని పోలింగ్ సరళిని ఆయన లైవ్‌లో వీక్షించారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ల నుంచి సమాచారం ఎంత వేగంగా అందుతోంది? ఏవైనా సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్నాయా? అనే అంశాలపై రాణి కుముదినిని అడిగి తెలుసుకున్నారు.

అక్రమాలకు ఇక తావులేదు..

వెబ్ కాస్టింగ్ వినియోగం వల్ల ఎన్నికల ప్రక్రియలో అత్యంత పారదర్శకత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో రిగ్గింగ్, దొంగ ఓట్లు, అసాంఘిక శక్తుల ప్రవేశం వంటి అక్రమాలను ఈ నిఘా కళ్లతో సమర్థవంతంగా అడ్డుకోవచ్చని సీఈఓ పేర్కొన్నారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతతో పాటు, టెక్నాలజీని జోడించడం శుభపరిణామమని ఆయన కొనియాడారు.

రాబోయే ఎన్నికలపై కసరత్తు

కేవలం మున్సిపల్ ఎన్నికలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఈ భేటీలో ముందస్తు ప్రణాళికలు రచించారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులు, క్షేత్రస్థాయి ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల గణన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం, కోర్టు ఆదేశాలకు లోబడి నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఎస్‌ఈసీ దృష్టి సారించింది. ఈ సమావేశం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఫలితాల అనంతరం స్థానిక పోరుకు లైన్ క్లియర్ చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

మున్సిపల్ నగారా.. ఫిర్యాదుల కోసం ‘TE-Poll’ మొబైల్ యాప్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, పౌరులకు చేరువగా ఉంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అడుగు వేసింది. ఓటర్లు తమ ఫిర్యాదులను ఎక్కడి నుంచైనా నమోదు చేసేలా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.

అరచేతిలోనే ఎన్నికల పర్యవేక్షణ..

ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలు లేదా అక్రమాలపై పౌరులు తక్షణమే స్పందించేందుకు ‘TE-Poll’ పేరుతో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు తలెత్తినా, నిబంధనల ఉల్లంఘనలు జరిగినా ఈ యాప్ ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. కేవలం యాప్ మాత్రమే కాకుండా, అధికారిక వెబ్‌సైట్ tsec.gov.in ద్వారా కూడా ఫిర్యాదులు చేసే సౌలభ్యాన్ని కల్పించారు.

ఫిబ్రవరి 11న తుది పోరు..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 నగరపాలక సంస్థలు , 116 పురపాలక సంఘాల భవితవ్యాన్ని తేల్చేందుకు సర్వం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనుండగా, అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫిబ్రవరి 13న చేపట్టనున్నారు. ఈ స్వల్ప వ్యవధిలోనే ఎన్నికల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై, సాంకేతికత సాయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

తమిళనాడులో మోదీ ‘ఎన్నికల’ శంఖారావం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దక్షిణాదిలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వేదికగా భారీ బహిరంగ సభతో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. "తమిళనాడులో అవినీతి రాజ్యమేలుతోంది.. డీఎంకే పతనం ప్రారంభమైంది" అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి.  ఈ బహిరంగ సభలో కూటమిలోని కీలక భాగస్వామి పక్షాలైన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

డీఎంకే పార్టీలో ఎదగాలంటే అవినీతి చేయాల్సిందేనని, ఆ పార్టీ సిద్ధాంతమే దోచుకోవడం అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. తమిళనాడు ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే అహంకారానికి ఈ ఎన్నికల్లో స్వస్తి పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. సుపరిపాలన, ప్రాంతీయ ఆకాంక్షలకు గౌరవం ఇవ్వడం కేవలం ఎన్డీయే కూటమితోనే సాధ్యమని ప్రధాని స్పష్టం చేశారు. తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు నెలకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన నేపథ్యంలో, పాత మిత్రులను కలుపుకొని వెళ్తున్న మోదీ వ్యూహం ఎంతవరకు పారితుందో చూడాలి. మధురాంతకం సభలో జనసందోహం చూస్తుంటే ఎన్డీయే కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది.

మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల
విశ్వంభర తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు చివరి దశకు చేరుకుంది. 2026 మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలోని మెజారిటీ పట్టణాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఆధిక్యంలో ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్లం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 25,62,639 మంది ఉండగా, మహిళా ఓటర్లు 26,80,014 మంది, ట్రాన్స్‌జెండర్లు 640 మంది ఉన్నారు.

ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కార్పొరేషన్ 3,48,051 ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 66 వార్డులున్న కరీంనగర్ కార్పొరేషన్‌ 3,40,580 ఓటర్లతో రెండో స్థానంలో ఉంది.ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. సూర్యాపేటలో 1,08,848 ఓటర్లు ఉండగా.. అమరచింత మున్సిపాలిటీలో కేవలం 9,147 ఓటర్లతో అత్యల్ప స్థానంలో నిలిచింది.

జనవరి 20న నోటిఫికేషన్?
ఈనెల 12తో ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తి కావడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 16 నుంచే ముఖ్యమంత్రి సహా ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. మరోవైపు ఓటర్లు తమ పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు!
అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు.. వీటి తర్వాత అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. అయితే.. జూలైలో నిర్వహించాలని మొదట భావించింది. కానీ.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో జరిగేలా ఉన్నాయి. దీనికి బలమైన కారణం బీసీల రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్ ఖరారు కాకుండా, ఎన్నికలు వెళ్లొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

బీసీ కులగణన, రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుంది. దీంతో.. జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఆ వెంటనే  మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు 23 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో చట్ట సవరణ చేయాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నది. ఇక జూలైలో మండల పరిషత్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం కూడా ముగిస్తే.. వాటికి కూడా  స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉంది. మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి ముగుస్తుంది. అక్కడ కూడా ప్రత్యేక అధికారులను నియమిస్తారు.

రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయి: కిషన్ రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఇవాళ (గురువారం) ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. వడ్లకు బోనస్ లేదు అని చురకలు అంటించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బందులకు గురిచేశారని... ఇప్పుడు, దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని రేవంత్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని కిషన్ రెడ్డి నిలదీశారు. రైతులకు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతి గింజను కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. రైతుల్లో వ్యతిరేకత మూటగట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు పడితే... కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 నెలలే పట్టిందన్నారు. దొడ్డు రకం వడ్లు వేసిన రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

ఓటరును కాలితో తన్నిన ఎమ్మెల్యే తమ్ముడు
విశ్వంభర, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతున్న తరుణంలో  అక్కడక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తాజాగా ఆంధ్రాలో ఓటర్ పై ఎమ్మెల్యే చేయి చేసుకొగా తిరిగి ఓటర్ సైతం ఎమ్మెల్యే పై దాడి చేసిన సంఘటన సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా తెలంగాణ లో కూడా కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. జహీరాబాద్​ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేశ్​ షెట్కార్ సోదరుడు నగేష్​ షెట్కార్... ఓటర్​ ను కాలితో తన్నడం వీడియోలో కనిపించింది. ఈ ఘటన నారయణఖేడ్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద జరిగింది. కాగా ఈ దాడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంపీ అభ్యర్ధి తమ్ముడిపై నెటిజన్లు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. అలాగే అతనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓటరుపై దాడి చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేయడానికి వచ్చిన ఓటరుపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్ దాడి. pic.twitter.com/FN8VAPMo35

— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024