Konaseema - Vishvambhara News

చిప్పలోనే విఘ్నేశ్వరుడి రూపం: వావ్ అనిపిస్తున్న టీచర్ శ్రీను క్రియేటివిటీ
Coconut Shell Ganesha: వినాయక చవితి సందర్భంగా ఓ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు తన సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకున్నారు. కొబ్బరి చిప్పలోనే శ్రీ విఘ్నేశ్వరుని ప్రతిమను ఆవిష్కరించి తన కళాత్మక నైపుణ్యాన్ని చాటుకున్నారు. చిన్న కొబ్బరి చిప్పలో గణనాథుడి రూపాన్ని అందంగా తీర్చిదిద్దడం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. రామచంద్రపురం మండలం హసన్‌బాద్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జీ. శ్రీను ఈ వినూత్న సృష్టిని రూపొందించారు. కొబ్బరి కాయను నిలువుగా కట్ చేసి, దేవుడికి సమర్పించే చిప్ప భాగంలోనే గణనాథుడి రూపాన్ని కళాత్మకంగా ఆవిష్కరించారు.

కొబ్బరి చిప్ప ఆకృతిని ఉపయోగించుకుని విఘ్నేశ్వరుడి రూపాన్ని తీర్చిదిద్దిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా కనిపించే వస్తువులోనే సృజనాత్మకతను జోడించి అందమైన కళాఖండంగా మలిచిన ఉపాధ్యాయుడి ప్రతిభను పలువురు ప్రశంసిస్తున్నారు. శ్రీను రూపొందించిన గణనాథుడి ప్రతిమను చూసిన పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. స్థానికులు కూడా ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన, కళాత్మక నైపుణ్యాన్ని కొనియాడుతున్నారు. చిన్న వస్తువుతోనూ అద్భుతమైన కళను సృష్టించవచ్చని ఈ గణపతి ప్రతిమ చాటిచెబుతోందని ప్రశంసిస్తున్నారు.