Hyderabad Crime News - Vishvambhara News

నాగోల్ బండ్లగూడలో దారుణ హత్య.. వ్యక్తిని వెంటాడి వేటకొడవళ్లతో నరికిన దుండగులు
Bandlaguda Murder: హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని కొందరు దుండగులు వెంటాడి వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనతో బండ్లగూడలో తీవ్ర కలకలం నెలకొంది. దుండగులు వెంటపడటంతో ప్రాణభయంతో పరుగులు తీసిన బాధితుడు బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్ పర్మిట్ రూంలోకి వెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ దుండగులు అక్కడికి చేరుకుని అతడిని చుట్టుముట్టారు. అనంతరం మద్యం బాటిళ్లు, వంటపాత్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

అక్కడితో ఆగకుండా వేటకొడవళ్లతో దాడి చేసి వ్యక్తిని దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. ఘటన అనంతరం దుండగులు అక్కడి నుంచి కారులో పరారైనట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు, అతడిని హత్య చేసింది ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాత కక్షలు, ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు కారులో వచ్చినట్లు గుర్తించిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.