telangana - Vishvambhara News

తెలంగాణ ప్రజలకు బిజెపి ఎంపీ తేజస్వి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పాలి : కాచం సత్యనారాయణ
విశ్వంభర,హైదరాబాద్ : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహం నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా తేజస్వి సూర్య కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం వేలాదిమంది, యువత త్యాగాల ఫలితం గా రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన తెలంగాణ రాష్టాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం తెలంగాణ అమరుల త్యాగాలను అవమానిచడమేనని పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానించేలా తేజస్వి సూర్య మాట్లాడుతుంటే తెలంగాణ బీజేపీ ఎంపీ లు స్పందించకపోవడం దారుణం అన్నారు. తెలంగాణ పై బీజేపీ ద్వంద వైఖరికి ఇది నిదర్శనం అన్నారు.

తెలంగాణ రాష్టం, తెలంగాణ అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిందన్నారు, అలాంటి తెలంగాణ ను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడిన ఊరుకునే ప్రసక్తే లేదని కాచం సత్యనారాయణ హెచ్చరించారు.ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం, తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించి వెంటనే తేజస్వి సూర్య తో క్షమాపణ చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యములోవేలాది మంది ఉద్యమకారులతో కలిసి తెలంగాణ బీజేపీ ఎంపీల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం నాయకులు రామ్ నరసింహ గౌడ్, బీరెల్లి వెంకట్ రెడ్డి,ఉప్పల శ్రవణ్ కుమార్, కొత్త రవి,కొండ శ్రీనివాస్, పిడికిలి రాజు,సల్వా చారి,శ్రీధర్,కృష్ణ గుప్తా,అరుణ్ గౌడ్,పద్మ కృష్ణ, డి. వెంకటేష్, మల్లేష్, శ్రవణ్ రెడ్డి, జగదీశ్,శ్రీరాములు, వెంకట్ రెడ్డి, బాలరాజు గౌడ్, అశోక్ చారి, పరమేశ్వర్, కొండల్, రామకృష్ణ రెడ్డి, ఎండీ జాహెద్, టీ. మోహన్,ఎన్ రమేష్, మల్లేష్,కొండయ్య, జగన్, పిల్లి వెంకటేష్, మల్లేష్ యాదవ్, హరిబాబు, యాదగిరి, పబ్బ శ్రీనివాస్ గౌడ్, పబ్బ శేఖర్ గౌడ్, రాములు, శివ కృష్ణ, శ్యామ్ సుందర్ రెడ్డి, వెంకటేష్ కుమార్, జయ శ్రీనివాస్ గౌడ్, వీరస్వామి, బాలస్వామి, సోమ శ్రీరాములు, మల్లేష్, శ్యామ్ సుందర్ గౌడ్, కార్తీక్ చారి, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌తో మాజీ మావోయిస్టు అగ్రనేతల భేటీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మావోయిస్టు నేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి తదితరులు కలిశారు. అడవి బాట వీడి సమాజంలో కలిసిన తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన తోడ్పాటుపై వీరు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రనేతలు నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో బలగాలు విరుచుకుపడుతుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం శాంతియుత మార్గానికి ప్రాముఖ్యత ఇస్తోంది. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించినట్లు సమాచారం.

పునరావాస ప్యాకేజీపై కసరత్తు
లొంగిపోయిన నేతలకు ఇళ్ల స్థలాలు, పిల్లల చదువు, ఉపాధి వంటి అంశాలపై అధికారులు ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో, మాజీ నక్సలైట్లు ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే వీరందరి కోసం ఒక సమగ్రమైన 'సంక్షేమ ప్యాకేజీ'ని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.

‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’.. 104 మంది అరెస్ట్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ పేరుతో దేశవ్యాప్తంగా అతిపెద్ద ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం 16 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు 32 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గత 10 రోజుల పాటు నిరంతరాయంగా సాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 104 మంది సైబర్‌ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల్లో సామాన్యులే కాకుండా, నేరగాళ్లకు సహకరించిన పలువురు బ్యాంకు అధికారులు కూడా ఉండటం గమనార్హం. నిందితులపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 1,055 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు వీరు పలు రకాల సైబర్‌ నేరాలకు పాల్పడి అమాయకుల నుంచి రూ.127 కోట్లకు పైగా దోచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరి అరెస్టుతో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

భారీగా పట్టుబడిన మారణాయుధాలు, పరికరాలు
నిందితుల స్థావరాలపై దాడులు చేసిన సమయంలో పోలీసులు భారీ ఎత్తున నేరపూరిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.36 లక్షల నగదుతో పాటు, నేరాలకు ఉపయోగించే 204 మొబైల్‌ ఫోన్లు, 141 సిమ్‌ కార్డులను సీజ్ చేశారు. వీటితో పాటు 152 బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, 234 డెబిట్‌ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలను నేరగాళ్లకు చేరవేయడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

అత్యాధునిక నెట్‌వర్క్‌ ధ్వంసం
ఈ ఆపరేషన్‌ ద్వారా దేశంలోని ప్రధాన సైబర్‌ నేరగాళ్ల ముఠాకు గట్టి దెబ్బ తగిలింది. పక్కా సమాచారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైదరాబాద్ పోలీసులు ఈ భారీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు లేదా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఖమ్మంలో కాంగ్రెస్ ‘రాక్షస కాండ’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. వేల మంది పోలీసుల పహారాలో, నాలుగు జిల్లాల బలగాలను మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం అత్యంత హేయమైన చర్య అని, పేద ప్రజలు ప్రభుత్వానికి తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని  నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే ప్రభుత్వం చేస్తున్న అరాచకం బయటకు తెలియకూడదనే భయం కనిపిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. "చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారు" అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నమ్మబలికిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

గుండె తరుక్కుపోతున్న బాధితుల రోదన
ఓటు వేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని బాధితులు రోదిస్తుంటే చూసి గుండె తరుక్కుపోతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషమని పేర్కొన్నారు. బాధితుల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

బీఆర్ఎస్ అండగా ఉంటుంది
వెంటనే అక్రమ కూల్చివేతలను ఆపి పోలీసులు వెనక్కి వెళ్లాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి, ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదు అని స్పష్టం చేస్తూ, పేదల గూడు చెదిరితే ప్రభుత్వ గద్దెలు కూడా అంతే వేగంగా కూలుతాయని హెచ్చరించారు.

హామీలు గాలికి.. వసూళ్లే లక్ష్యం..రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ధ్వజం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం తన కుర్చీని కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల అభివృద్ధిపై లేదని విమర్శించారు. ఢిల్లీలోని పెద్దలకు వేల కోట్ల రూపాయలు పంపడంపైనే మంత్రివర్గ సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయని, సామాన్యుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు నెలకు రూ.2500లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

నిరుద్యోగులు, విద్యార్థులపై నిర్లక్ష్యం
నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ నిలదీశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల వేలాది విద్యా సంస్థలు, లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు పేదలకు వైద్యం అందించడం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలే లక్ష్యంగా పోరాటం
కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో, వాటికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో కేబినెట్ సమావేశంలో చర్చించి స్పష్టమైన తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ ప్రజాప్రతినిధులు
మంగళవారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనకు బీజేపీ సిద్ధమైంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి బండి సంజయ్, రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరి భాగ్యలక్ష్మి ఆలయం, అనంతరం లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో కీలక మార్పు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును 'డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ద్వితీయ శ్రేణి వైద్య సేవలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో తీసుకున్న చర్యగా ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ మెట్రోను పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించడం రవాణా రంగంలో పెను మార్పులకు సంకేతంగా నిలిచింది.

అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు
వచ్చే నెల మార్చి 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉండగా, 17, 18 తేదీలలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజునే రంజాన్ పండుగ రావడం, అంతకు ముందు రోజే ఉగాది ఉండటంతో పండుగ వాతావరణంలోనే సభ సాగనుంది.

విద్యా, ధార్మిక రంగాలకు భూ కేటాయింపులు
కేబినెట్ నిర్ణయాలలో భూ కేటాయింపులకు పెద్దపీట వేశారు. భక్తుల సౌకర్యార్థం ఖమ్మం జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 20 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. అలాగే మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరు ప్రాంతంలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి 70 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల మారుమూల ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జంట జలాశయాల కాలుష్యంపై హైకోర్టు సీరియస్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భాగ్యనగరానికి దశాబ్దాలుగా దాహార్తిని తీరుస్తున్న హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల దుస్థితిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జలాశయాల్లోకి యథేచ్ఛగా మురుగు నీరు, పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత వ్యర్థాలు చేరుతున్నాయంటూ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న తాగునీటి వనరులు ఇలా కలుషితమవ్వడంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేస్తూ విచారణను వేగవంతం చేసింది. జలాశయాల పరిరక్షణ బాధ్యత కలిగిన వివిధ ప్రభుత్వ విభాగాల తీరును హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీలను ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. తాగునీటి సరఫరా చేసే చెరువుల్లోకి వ్యర్థాలు చేరుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని, పర్యవేక్షణ లోపానికి గల కారణాలేమిటని ధర్మాసనం నిలదీసింది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు గాలికి వదిలేసిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

జంట జలాశయాల ప్రస్తుత పరిస్థితి, కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జలాశయాల చుట్టూ ఉన్న ఆక్రమణలు, వ్యర్థాల విడుదల నిలిపివేతకు చేపట్టిన ప్రణాళికలను నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. దీనికోసం అధికారులకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. జలాశయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీజీఎస్‌ ఆర్టీసీకి 1,085 ఎలక్ట్రిక్ బస్సులు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రవాణా రంగంలో విద్యుత్ వాహనాల శకం మరింత విస్తృతం కానుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సేవలలో భాగంగా కొత్తగా 1,085 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కు టీజీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఈ భారీ ప్రక్రియ ముందుకు సాగుతోంది. నగరాల్లో కాలుష్య రహిత ప్రజా రవాణాను పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం
హైదరాబాద్ నగర రోడ్ల స్థితిగతులు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సులను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. 12 మీటర్ల పొడవు ఉండే ఈ లో-ఫ్లోర్ బస్సులలో ఏసీ, నాన్-ఏసీ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులకు కుదుపులు లేని ప్రయాణాన్ని అందించేందుకు బస్సు ముందు, వెనుక భాగాలలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు కేవలం 45 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని కలిగి ఉండి, ఒకే ఛార్జ్‌తో 250 కిలోమీటర్ల పైగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

అందరికీ అందుబాటులో సౌకర్యాలు
కేవలం సాంకేతికతకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో ఈ బస్సులను డిజైన్ చేశారు. ముఖ్యంగా వీల్‌చైర్ ఉపయోగించే ప్రయాణికుల కోసం బస్సులో ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3,600 కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా నడుపుతున్న ఒలెక్ట్రా సంస్థకు, ప్రస్తుతం చేతిలో ఉన్న 10 వేల వాహనాల ఆర్డర్లలో ఇది అత్యంత కీలకమైనది. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో ఈ బస్సులను అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

పర్యావరణ హితమే లక్ష్యం
పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు విద్యుత్ వాహనాలే సరైన ప్రత్యామ్నాయమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త బస్సుల రాకతో డీజిల్ వినియోగం తగ్గడమే కాకుండా, శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావడం వల్ల సాధారణ ప్రయాణికులకు కూడా విలాసవంతమైన ప్రయాణం చేరువ కానుంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద దక్కిన ఈ ఆర్డర్ సంస్థకు, రాష్ట్ర రవాణా రంగానికి కొత్త ఊపిరిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో సర్కార్ వశం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఎల్&టీ సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం భాగ్యనగర ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది. నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చేపడితే ప్రయాణ ఛార్జీలు, సౌకర్యాల విషయంలో సామాన్యులకు మరింత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

రెండో దశ విస్తరణపై భారీ కసరత్తు
నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ పనులను అత్యంత ప్రాధాన్యతతో పట్టాలెక్కించాలని సర్కార్ నిశ్చయించుకుంది. మొత్తం 86.1 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ విస్తరణ ప్రాజెక్టు కోసం సుమారు రూ.19,579 కోట్ల అంచనా వ్యయాన్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టు పట్ల సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు వేగవంతం కానున్నాయి.

నిర్వహణ మార్పుతో కొత్త సవాళ్లు
మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వెనుక ఆర్థిక, సాంకేతిక కారణాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎల్&టీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకునే యోచనలో ఉందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారీ పెట్టుబడితో కూడిన ఈ ప్రాజెక్టును సొంతంగా నిర్వహించడం ప్రభుత్వానికి ఒక సవాలుతో కూడుకున్న పని. ఎల్&టీ సంస్థ తన వాటాలను, బాధ్యతలను ఏ విధంగా బదిలీ చేస్తుందనే అంశంపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది.

ప్రయాణికులకు చేకూరనున్న లబ్ధి
రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల నగరంలోని ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రెండో దశ పూర్తయితే విమానాశ్రయం సహా శివారు ప్రాంతాలకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం పూర్తి బాధ్యత చేపడితే ప్రజారవాణా వ్యవస్థగా మెట్రో మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. భవిష్యత్తులో ఈ నిర్ణయం మెట్రో రైలు మనుగడను, విస్తరణను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

పోలీసింగ్‌లో యువత భాగస్వామ్యం.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ముందడుగు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరబాద్ నగర పోలీసులు సరికొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. విద్యావంతులైన యువతలోని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాన్ని పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు 'ఇంటర్న్‌షిప్', 'ప్రొఫెషనల్ వాలంటీర్' ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. దీని ద్వారా అటు విద్యార్థులకు ప్రభుత్వ పరిపాలనపై అవగాహన, ఇటు పోలీస్ శాఖకు నూతన దృక్పథం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఎస్‌ఎమ్‌ఐటీ సెల్ ద్వారా కొనసాగుతుంది.

ఇంటర్న్‌షిప్ అర్హతలు - బాధ్యతలు
ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. 25 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టులు, ఆధునిక పోలీసింగ్ పద్ధతులకు సంబంధించిన పనులను కేటాయిస్తారు. ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన వారికి హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అధికారిక సర్టిఫికెట్ అందజేస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా, వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులు కూడా 'వాలంటీర్'గా చేరి సాంకేతిక లేదా ప్రక్రియ ఆధారిత పనుల్లో పోలీసులకు సహకరించవచ్చు.

సరికొత్త ఆలోచనలకు వేదిక
ఈ అంశంపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. విద్యార్థులు పోలీసు అధికారులతో కలిసి పనిచేస్తూ, విభాగపు పనితీరులో సరికొత్త ఆలోచనలను జోడించడానికి ఇదొక చక్కని వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు విలువైన అనుభవం లభిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు హైదరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ www.hyderabadpolice.gov.in సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా నేర పరిశోధన, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా పోలీసింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవచ్చని పోలీస్ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

పేదల సొంతింటి కలపై కేంద్రానికి విన్నపం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రానికి రావాల్సిన ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో కేంద్రం నుండి ఒక్క ఇల్లు కూడా సాధించలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లు కేటాయించాలని గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని పదేపదే కోరుతున్నట్లు వివరించారు.

5 లక్షల ఇళ్లపై దృష్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రాష్ట్రం అధికారికంగా పీఎంఏవై-జి పథకంలో చేరిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 12 ఏళ్లలో పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది 3 లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, దీనికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అర్హుల గుర్తింపు పూర్తి
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు పొంగులేటి కేంద్ర మంత్రికి వివరించారు. డేటాబేస్ పక్కాగా ఉందని, ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్రం తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

కష్టపడే వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు..డీసీసీ శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: వికారాబాద్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని, వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినయోగం చేయవద్దని సూచించారు. వారసత్వంగా ఎవరికీ అవకాశాలు రావని, మనం పడే కష్టం, శ్రమ ఎప్పటికీ వృథా పోవని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణను శిక్షగా భావించవద్దని కోరారు.

డీసీసీలుగా ఎన్నికైనంత మాత్రాన ఆ జిల్లాలపై తమదే ఆధిపత్యమని, తామే అధిపతులమని భావిస్తే అది పెద్ద తప్పిదమని రేవంత్ హెచ్చరించారు. డీసీసీ పోస్టు అనేది కేవలం అధికారం మాత్రమే కాదని, అది ఒక కుటుంబ పెద్దలాంటి బాధ్యత అని గుర్తు చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారు ఉంటారని, ఇది మహాత్మా గాంధీ కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయమని పేర్కొన్నారు. భిన్న స్వరాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలే తప్ప, వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తే అది పార్టీకి కీడు చేసినట్లవుతుందని హితవు పలికారు.

తాను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, సొంత పార్టీలోనే కొందరి నుంచి వ్యతిరేకత ఎదురైందని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ నేతలందరి ఇళ్లకు వెళ్లి వారిని కలిసినట్లు వివరించారు. వయసులో, అనుభవంలో చిన్నవాడినైనా పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, సహకరించాలని కోరి అందరినీ ఒప్పించినట్లు చెప్పారు. అందరం సమిష్టిగా కృషి చేయడం వల్లే పార్టీ ఓటింగ్ శాతం 2.5 నుండి 40 శాతానికి చేరిందని విశ్లేషించారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని, అక్కడ అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ పదవులు కల్పించామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.