Ganesh Mandapam - Vishvambhara News

రోడ్లు బ్లాక్ చేసి మండపాల ఏర్పాటు.. అనంతపురం పోలీసులకు పట్టదా?
Anantapur Urban Ganesh Mandapam: అనంతపురం అర్బన్ పరిధిలో వినాయక చవితి మండపాల ఏర్పాటుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను పూర్తిగా ఆక్రమించి మండపాలు ఏర్పాటు చేస్తున్నారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా రోడ్లపై స్థలం లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు.

వినాయక చవితి సందర్భంగా కొన్ని మండపాలను దాదాపు వారం రోజుల పాటు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసి మండపాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు అనుమతులు ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాల ఏర్పాటుకు నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు ఈ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు.

మరోవైపు మండపాల ఏర్పాటులో భాగంగా సీసీ రోడ్లకు గుంతలు వేస్తున్నారని, దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు పరిస్థితిని పరిశీలించాలని కోరుతున్నారు. ప్రజల భద్రత, రాకపోకలకు ఇబ్బంది లేకుండా మండపాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గత ఏడాది కూడా ఇదే తరహాలో సమస్యలు ఎదురయ్యాయని, అప్పట్లో మున్సిపల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లకు పలువురు ఫిర్యాదులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని, అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన మండపాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.