KCR - Vishvambhara News

కేసీఆర్ చనిపోవాలని కోరుకున్నట్లు ఏదో ఫ్లోలో అన్నాను: వీర్లపల్లి శంకర్
Veerlapalli Shankar: మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు తాను ఏదో ఫ్లోలో అన్నానని ఆయన పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ను ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, మాటల సందర్భంలో ఫ్లోలో ఆ వ్యాఖ్య వచ్చిందని శంకర్ తెలిపారు. తన వ్యాఖ్యలను రాజకీయంగా వివాదాస్పదం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

కాగా, వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. 500 మీటర్ల ఫ్లెక్సీతో కాంగ్రెస్ భారీ ర్యాలీ
Vemulawada Congress Rally: అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేములవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూ.. ప్రజల తరఫున అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భారీగా ఏర్పాటు చేసిన 500 మీటర్ల పొడవైన ఫ్లెక్సీతో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్ నేతలు అన్నారు. వేములవాడలో నిర్వహించిన ఈ వినూత్న నిరసన కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని అన్నారు. గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఈ ర్యాలీతో వేములవాడలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

కేసీఆర్‌ ఆనవాళ్లలో ‘ది సెక్రటేరియట్‌’.. పాటలో ప్రత్యేక ఆకర్షణ
Telangana Secretariat: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో నిర్మించిన కొత్త సచివాలయం ప్రస్తుతం మరోసారి చర్చలోకి వచ్చింది. ‘ది సెక్రటేరియట్‌’ పేరుతో ఇడుపు కాయితంలోని ఓ పాటలో సచివాలయం ప్రస్తావన రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని జనం కామెంట్లు చేస్తున్నారు. పాటలో ‘ది సెక్రటేరియట్‌’ అనే పదం వినిపించడంతో కేసీఆర్‌ పాలనకు సంబంధించిన ఆనవాళ్లు, ఆయన హయాంలో చేపట్టిన నిర్మాణాలు మరోసారి గుర్తుకొస్తున్నాయని పలువురు మాట్లాడుకుంటున్నారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో కొత్త సచివాలయ భవన నిర్మాణం పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వ పరిపాలనకు కీలక కేంద్రంగా నిలిచేలా రూపొందించిన ఈ భవనం ప్రారంభం నుంచే ప్రత్యేక గుర్తింపు పొందింది. భారీ నిర్మాణం, ప్రత్యేక డిజైన్‌, గుమ్మటాలతో కూడిన రూపకల్పనతో సచివాలయం హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాణంగా మారింది. ప్రస్తుతం ‘ది సెక్రటేరియట్‌’ అనే ప్రస్తావన పాటలో రావడంతో సచివాలయం, దాని నిర్మాణం, కేసీఆర్‌ పాలనకు సంబంధించిన అంశాలపై మరోసారి చర్చ జరుగుతోంది.

కేసీఆర్‌ హయాంలో నిర్మించిన సచివాలయం ఆయన పాలనకు సంబంధించిన ముఖ్యమైన నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారినా కొన్ని నిర్మాణాలు, నిర్ణయాలు గత పాలనకు గుర్తులుగా మిగిలిపోతాయని, అదే విధంగా ‘ది సెక్రటేరియట్‌’ కూడా కేసీఆర్‌ హయాంలోని ఒక ముఖ్యమైన ఆనవాళ్లుగా నిలిచిందని జనం అభిప్రాయపడుతున్నారు. పాటలో ఈ ప్రస్తావన రావడం వల్ల సచివాలయం మరోసారి చర్చకు వచ్చింది.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు.. హరీశ్‌రావు ఘన నివాళి
Harish Rao: తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఘన నివాళులు అర్పించారు. బహుజన వర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన కృషి నేటి తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని హరీశ్‌రావు అన్నారు.

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతులను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బహుజన వర్గాల చరిత్ర, త్యాగాలు, పోరాటాలను గుర్తిస్తూ వారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

అదేవిధంగా వేలాది మంది దళిత, బహుజన పిల్లలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందని హరీశ్‌రావు అన్నారు. రాజకీయ అధికారంలో వెనుకబడిన వర్గాలకు తగిన వాటా కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బహుజన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం పనిచేశామని హరీశ్‌రావు తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన పోరాటాలను స్మరించుకోవడంతో పాటు, సమాజంలో సమానత్వం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు అన్నారు.

నేతన్నల కష్టానికి వందనం.. చేనేత కార్మికులకు కేటీఆర్ శుభాకాంక్షలు
KTR NEWS: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నరాలను పోగులుగా, రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను అందమైన చీరలుగా మలిచి భారతీయ నాగరికతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నేతన్నల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం భారతీయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.

తెలంగాణ చేనేత కార్మికులు సమైక్య పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలు నేసే నైపుణ్యం ఉన్నప్పటికీ, ఉపాధి లేక అనేక మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో నేతన్నల జీవితాలను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరల పంపిణీ, రుణమాఫీ, పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పలువురు చేనేత కార్మికులు తిరిగి తెలంగాణకు వచ్చి తమ వృత్తిని కొనసాగించే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.

చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతన్నల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేసిందని, భవిష్యత్తులో కూడా చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్నల కష్టం, కళను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ కుటుంబ ఆస్తులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపణలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ అంశంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014కు ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ల అధికారంలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని వేల కోట్లు సంపాదించారని కడియం ఆరోపించారు. ఈ ఆస్తుల వివరాలన్నీ ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ 'జాతిపిత' ఎవరు?
కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించడాన్ని కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ కోసం ఆయన ఏం చేశారని జాతిపిత అంటున్నారని ప్రశ్నించారు. అధికారాన్ని ఒక కుటుంబ హక్కుగా భావిస్తున్నారని, తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సొంతం అనేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ స్కాములు చేశారని, వారిపై కేసులు ఉన్నాయని కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులపై కేసులు ఉంటే తెలంగాణను అవమానించినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య సొత్తా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్ని రోజులు సెంటిమెంట్‌ను వాడుకుంటారని ప్రశ్నించిన ఆయన, ప్రజలు తిరస్కరించినా అహంకారం తగ్గడం లేదని, మాట తీరులో మార్పు రాలేదని విమర్శించారు. అధికారాన్ని తమ హక్కుగా భావించే ధోరణి ఇకనైనా మానుకోవాలని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ జాతి హీరో కేసీఆర్: కేటీఆర్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడూ తాను "జాతిపిత"నని చెప్పుకోలేదని, తమ జాతికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నేతను ప్రజలే అలా పిలుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితర ముఖ్య నేతలు పాల్గొని 72 కిలోల కేక్ కట్ చేశారు. అలాగే కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనను ప్రతిబింబించే డాక్యుమెంటరీని నేతలు విడుదల చేశారు.

ద్రోహుల జాతి వర్సెస్ ఫైటర్ల జాతి
ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమకారుల మీదకు తుపాకులు తీసుకొని దాడికి వెళ్లిన వారికి "జాతి" నిర్వచనం తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ జై నినాదానికి భయపడే వారికి, తెలంగాణ సోయి లేని వారికి జాతి విలువ తెలియదన్నారు. తెలంగాణలో కేవలం "తెలంగాణవాదుల జాతి", "తెలంగాణ ద్రోహుల జాతి" మాత్రమే ఉన్నాయని, తమది ఫైటర్ల జాతి అయితే, వారిది ద్రోహుల జాతి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం అసాధ్యం
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని కొందరు అంటున్నారని, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు అయినప్పుడు వాటిని ఎలా చెరిపేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరులు, విద్యార్థి అమరవీరుల జాతి తమదని ఆయన కొనియాడారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే కార్యకర్తలు జన్మదిన సందర్భంగా ఇచ్చే చిరుకానుక అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

నేరాలు చేస్తే విచారణ తప్పదు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారానికి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని, చట్టం ముందు ఎవరూ అతితీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్‌కు సిట్ నోటీసుల వ్యవహారంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నేరాలు చేసినప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిందేనని, తాము ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి అధికారులు విచారించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

జాతిపిత హోదాపై తీవ్ర అభ్యంతరం
కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనను 'తెలంగాణ జాతిపిత'గా అభివర్ణించడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించి, కేవలం కుటుంబ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇచ్చిన వారు జాతిపితలు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. అసలైన తెలంగాణ ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసి, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి మేధావులను అవమానించిన చరిత్ర కేసీఆర్ సర్కార్‌దని దుయ్యబట్టారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులే పంచుకున్నారని, ఆనాడు ఉద్యమకారుల తలుపులు బద్దలు కొట్టి బెడ్ రూమ్‌ల నుంచి ఈడ్చుకెళ్లినప్పుడు ఈ 'జాతిపిత' హోదా ఎటు పోయిందని నిలదీశారు.

విచారణకు సహకరించాల్సిందే..
ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు విచారణ అంటే తప్పించుకోవడం సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడని ఉద్యమకారుడు లేడని, అనేకమందిని అరెస్టులు చేసి వేధించారని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా విచారణను ఎదుర్కోవాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన సాగుతోందని, గతంలో జరిగిన అరాచకాలను తాము ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.

కేసీఆర్‌కు ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ న్యాయ బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నోటీసులు చట్టబద్ధంగా చెల్లవని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. మోహిత్ రావు తన అధికారిక ప్రకటనలో చట్టంలోని కీలక అంశాలను ప్రస్తావించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 (CRPC-160) ప్రకారం.. వయస్సు, ఇతర ఆరోగ్య కారణాల దృష్ట్యా కొన్ని వర్గాల వ్యక్తులకు నోటీసులు ఇవ్వడంపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. కేసీఆర్ విషయంలో ఈ నిబంధనలను సిట్ తుంగలో తొక్కిందని, చట్టాన్ని అతిక్రమించి నోటీసులు ఇవ్వడం చెల్లదని ఆయన పేర్కొన్నారు. ఏళ్ల తరబడి విచారణ పేరుతో వేధిస్తామంటే కుదరదని.. ఇలాంటి రాజకీయ కక్షసాధింపు కేసులను గతంలో సుప్రీంకోర్టు వందల సంఖ్యలో కొట్టేసిందన్నారు. ఈ నోటీసులపై తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

రాజకీయ వేడి.. న్యాయ పోరాటం
ఈ కేసులో తాజాగా నేరుగా గులాబీ బాస్ కేసీఆర్‌కు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. న్యాయపరంగా ఈ నోటీసులను ఎదుర్కోవడమే కాకుండా, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న 'కక్షసాధింపు' రాజకీయాలను ఎండగడతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పలువురు అధికారుల అరెస్టులతో సాగిన ఈ కేసు, ఇప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతోంది.

అనారోగ్యం కారణంగా విచారణకు రాలేను
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముంగిటకు చేరింది. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్న ప్రత్యేక విచారణ బృందం (SIT), తాజాగా కేసీఆర్‌కు అధికారికంగా నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సొంత పార్టీ నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ అధికారుల విచారణలో వెల్లడైన కీలక సమాచారం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులు పంపినట్లు సమాచారం.

అయితే, సిట్ నోటీసులపై స్పందించిన కేసీఆర్.. తాను ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. గత ఏడాది చివరలో జరిగిన మోకాలి శస్త్రచికిత్స తర్వాత తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఫిజియోథెరపీ, విశ్రాంతి అవసరమని ఆయన అధికారులకు విన్నవించారు. సుదీర్ఘ ప్రయాణాలు చేయడం, ఎక్కువ సమయం కూర్చోవడం ఆరోగ్యపరంగా ఇబ్బందికరమని, అందుకే తనకు కొంత సమయం కావాలని ఆయన కోరారు. చట్టం పట్ల తనకు గౌరవం ఉందని, అయితే ప్రస్తుత శారీరక స్థితి సహకరించడం లేదని ఆయన కార్యాలయం ద్వారా సిట్‌కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

మరోవైపు, కేసీఆర్ సమాధానంపై సిట్ అధికారులు తీవ్రంగా చర్చిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా విచారణను ఆలస్యం చేయడం సరికాదని భావిస్తున్న అధికారులు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ స్వయంగా కార్యాలయానికి రాలేని పక్షంలో, అధికారుల బృందమే నేరుగా ఆయన నివాసానికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిట్ సిద్ధం చేసినట్లు సమాచారం. నిందితుల వాంగ్మూలాల్లో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందా? ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వెళ్లాయి? అనే కోణంలో విచారణ సాగనుంది.

ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుండగా, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టానికి సమాధానం చెప్పాల్సిందేనని అధికార కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కేసీఆర్ విన్నపాన్ని మన్నించి సిట్ మరింత సమయం ఇస్తుందా? లేక విచారణ కోసం ఆయన నివాసానికే వెళ్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

డైలీ సీరియల్‌లా సిట్ విచారణ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని ఆమె విమర్శించారు.

ఈ కేసు విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, సిట్ విచారణ అసలు సీరియస్‌గా జరగడం లేదని మండిపడ్డారు. ఒక ముఖ్యమైన కేసును త్వరగా ముగించకుండా, ప్రభుత్వం దీనిని ఒక ‘డైలీ సీరియల్’ లాగా కావాలనే సాగదీస్తోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం అనేది ముమ్మాటికీ తప్పేనని, దానిని ఎవరూ సమర్థించబోరని స్పష్టం చేసిన ఆమె, అయితే ఈ కేసులో అసలైన నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఇంకెన్నాళ్లు నాన్చుతారో చూస్తామని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో విచారణాధికారులు సంధించిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలపై హరీశ్ రావు 'గులాబీ బాస్'కు వివరించినట్లు సమాచారం.

విచారణలో అసలేం జరిగింది?
మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విచారణలో సిట్ అధికారులు హరీశ్ రావును ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయనకు తెలిసిన అంశాలపై ఆరా తీశారు. అయితే, ఇప్పటికే అరెస్టయిన అధికారులు 'పెద్దాయన' ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో, ఆ పెద్దాయన ఎవరనే కోణంలోనే విచారణ సాగినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం సీన్ మళ్ళీ?
ప్రస్తుత పరిణామాలు గతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను గుర్తుచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం కేసులో హరీశ్ రావును విచారించిన వెంటనే ఆయన కేసీఆర్‌ను కలిశారు. ఆ భేటీ ముగిసిన కొద్ది రోజులకే కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ విచారణ ముగియడం, తక్షణమే ఎర్రవల్లిలో భేటీ జరగడం చూస్తుంటే.. తదుపరి నోటీసులు నేరుగా కేసీఆర్‌కే అందుతాయా? అనే చర్చ జోరందుకుంది.

సిట్' నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
దర్యాప్తు సంస్థలు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం విచారణ ప్రక్రియ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు వంటి వారు నిందితులుగా ఉండగా, రాజకీయంగా ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాగా, ప్రభుత్వ చర్యలను 'రాజకీయ కక్ష సాధింపు'గా అభివర్ణిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.

వరుస విచారణలు, నోటీసుల నేపథ్యంలో పార్టీ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు, అలాగే చట్టపరమైన చిక్కుల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై హరీశ్ రావుకు కేసీఆర్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.