Hutti Gold Mines - Vishvambhara News

హట్టి గోల్డ్‌ మైన్స్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్‌ మైన్స్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా గోల్డ్‌ మైన్స్‌లో కొనసాగుతున్న అన్వేషణ, బంగారం ఉత్పత్తి విధానాలను పరిశీలించారు. గనుల్లో ఖనిజాల అన్వేషణ, వెలికితీత, ఉత్పత్తికి సంబంధించిన విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో ఇటీవల వేలంలో దక్కించుకున్న దేవదుర్గ బంగారం, రాగి బ్లాక్‌ల అన్వేషణకు హట్టి గోల్డ్‌ మైన్స్‌లో ఉన్న అనుభవాలు, సాంకేతిక విధానాలు ఉపయోగపడతాయని భట్టి విక్రమార్క తెలిపారు. బంగారం, రాగి వంటి ఖనిజాల అన్వేషణలో హట్టి గోల్డ్‌ మైన్స్‌ అనుభవాలను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణలో ఖనిజ సంపదను మరింత సమర్థవంతంగా వెలికితీసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థను కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా.. బంగారం, రాగి వంటి ఇతర విలువైన ఖనిజాల ఉత్పత్తి, అన్వేషణ వైపు కూడా విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఖనిజ వనరులను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సింగరేణి కార్యకలాపాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

హట్టి గోల్డ్‌ మైన్స్‌ సందర్శనలో అక్కడి అన్వేషణ, ఉత్పత్తి ప్రక్రియలను పరిశీలించిన భట్టి విక్రమార్క.. తెలంగాణలో చేపట్టనున్న బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు అవసరమైన అంశాలను తెలుసుకున్నారు. దేవదుర్గ బ్లాక్‌లతో పాటు రాష్ట్రంలోని ఇతర ఖనిజ వనరుల అభివృద్ధికి ఈ అనుభవాలు ఉపయోగపడతాయని తెలిపారు.