Bhupalapally Mines - Vishvambhara News

మైన్స్‌ ఏడీ జయరాజ్‌ ఇంటిపై ఏసీబీ దాడులు
ACB Raids: భూపాలపల్లి మైన్స్‌ ఏడీ బొజ్జ జయరాజ్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. జయరాజ్‌ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌, సూర్యాపేట, తాండూరు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

జయరాజ్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా? ఆస్తుల సముపార్జనకు సంబంధించిన వివరాలు ఏమిటి? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో జయరాజ్‌కు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలు, ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.