elati maheshwar reddy - Vishvambhara News

బిజేపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. పోలీసులకు కాంగ్రెస్ నేతలు కంప్లైంట్
తెలంగాణ ప్రభుత్వంపై, మంత్రులపైనా బీజేపీ ఎల్పీ నేతల ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాస్పదంగా మారాయి. ఆయన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఏలేటి చేసిన ఆరోపణలకు ఆధారం లేదని పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో కేసు నమోదైంది.

మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఎరగని నాగన్న గౌడ్ ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఆధారాలు ఉంటే చూపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

యూ ట్యాక్స్‌ అంటూ నిరాధార ఆరోపణలు చేసిన మహేశ్వర్‌రెడ్డి వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా పదవులు పొంది, పార్టీ మారగానే ఆయనను విమర్శించడం పచ్చి అవకాశవాద రాజకీయమని మండిపడుతున్నారు.