Kuderu - Vishvambhara News

నష్టపరిహారం ఇవ్వకుండానే హైటెన్షన్‌ లైన్లు.. అనంతపురంలో రైతు ఆవేదన
Anantapur News: అనంతపురం జిల్లా కూడేరు మండలం కమూరు గ్రామంలో రైతు శ్రీధర్‌ చౌదరి తన భూమిలో నష్టపరిహారం చెల్లించకుండా హైటెన్షన్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ ప్రొటెక్షన్‌తో ఎమ్మార్వో మోహన్‌కుమార్‌ తన పొలానికి ఉన్న గేటు తాళం పగలగొట్టి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించి హైటెన్షన్‌ లైన్లు వేస్తున్నారని రైతు ఆరోపించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు న్యాయం చేయకుండా, నష్టపరిహారం చెల్లించకుండా తమ భూముల్లో విద్యుత్‌ టవర్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తన భూమిలో ఎలాంటి సంతకాలు తీసుకోకుండా హైటెన్షన్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని శ్రీధర్‌ చౌదరి తెలిపారు. నష్టపరిహారం చెల్లింపుల్లో కూడా రైతులందరికీ ఒకే విధంగా కాకుండా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా చెల్లిస్తున్నారని ఆరోపించారు. హైటెన్షన్‌ టవర్లు ఏర్పాటు చేసిన తర్వాత భూమి విలువ తగ్గడంతో పాటు వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. చదువుకున్న తనకే అధికారుల నుంచి అన్యాయం జరుగుతుంటే, చదువుకోని రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలపై అధికారులు స్పందించి నష్టపరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని, నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని రైతు కోరారు. ఇదే సమయంలో సమస్యపై కవరేజ్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులను ప్రాజెక్ట్‌ మేనేజర్లు వినోద్‌, మహేష్‌ అవహేళన చేశారని పేర్కొంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు, ప్రాజెక్టు సిబ్బంది సమస్యను పరిష్కరించకుండా మీడియాపై వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అంటున్నారు.

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పే ప్రభుత్వాల మధ్య క్షేత్రస్థాయిలో రైతులు తమ భూముల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాలతో పాటు రైతు సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. కమూరు గ్రామంలోని రైతు శ్రీధర్‌ చౌదరి సమస్యపై జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని, నష్టపరిహారం చెల్లింపులు, హైటెన్షన్‌ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు పరిశీలించి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.