Jeevan Reddy - Vishvambhara News

కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’ రామారావు : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
విశ్వంభర, హైదరాబాద్ :కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ’తెలంగాణ ’రామారావు అని, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు.ఎవరెన్ని కుట్రలు చేసినా స్వరాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర నుంచి, ప్రజల మదిలో పదిలపర్చుకున్న  పదేళ్ల సుపరిపాలనా ప్రస్థానం నుంచి కేటీఆర్ ఆనవాళ్లను చెరిపేయలేరని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కోట్లాది మంది గుండెల్లో కొలువైన యువనేత కేటీఆర్ అని ఆయన పేర్కొన్నారు. అధికారమదంతో ప్రభుత్వ పెద్దలు హైడ్రాను అడ్డం పెట్టుకొని కేటీఆర్ ప్లెక్సీలు తొలగించ గలరేమో కానీ,జనం గుండెల్లో గూడుకట్టు కున్న  ఆయన పేరును చెరిపేయలేరని స్పష్టం చేశారు.

కేటీఆర్ ఐటీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ అని , ఎస్‌ఎన్‌డీపీ, ఫ్లైఓవర్స్‌, నాలెడ్జ్‌ సిటీ ఇలా ఎన్నో కేటీఆర్‌ సృష్టించారని ఆయన తెలిపారు.   అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం తనలో సహజసిద్ధంగా ఉన్న అధ్యయనం, కార్యశీలత, కమిట్‌మెంట్‌, విషయ నైపుణ్యం వంటివి పుణికి పుచ్చుకున్న కేటీఆర్ కు దేశ, విదేశాల్లో గౌరవమర్యాదలు దక్కుతున్నాయన్నారు.  కేటీఆర్‌ సుదీర్ఘకాలం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో దేశ, విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందాయని, తన పనితీరుతో జాతీయ, అంతర్జాతీయ ఇమేజ్‌ను తెచ్చారనటంలో అతిశయోక్తి లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణలో ప్రైవేట్‌ రంగంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగిందనీ, పెట్టుబడులూ అదే దామాషాలో రాష్ర్టానికి వచ్చాయని ,దేశ, విదేశాల్లో ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాలకు కేటీఆర్‌ తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారారని ఆయన గుర్తు చేశారు. అందువల్లే అధికారం లేకపోయినా కేటీఆర్‌కు దేశ, విదేశాల్లో అదే క్రేజ్..అదే ఇమేజ్‌ ఇప్పటికే కొనసాగు తున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని  ఐటీ, ఇండస్ట్రీయల్‌ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్‌దని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో, హైదరాబాద్‌ అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలను స్థాపించడంలో కేటీఆర్‌ చేసిన కృషి, టీ-హబ్‌, వీ-హబ్‌, టీ-వర్స్‌ వంటి వినూత్న కార్యక్రమ స్టార్టప్‌ల సృష్టిలో అనుసరించిన వైఖరిని  పలు సందర్భాల్లో కొనియాడిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కేటీఆర్‌ను ఐకానిక్‌గా అభివర్ణించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్,

హైదరాబాద్ నగరానికి విశ్వఖ్యాతి తెచ్చిన దీక్షాదక్షుడు  కేటీఆర్ లవి చెరిపేస్తే పోయే ఆనవాళ్లు కాదన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రాలో కలపడమేనని, ఆయన కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆయన నెలకొల్పిన 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టడమేనని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీ ఉన్నంత వరకూ కేటీఆర్ పేరు చరిత్రలో నిల్చివుంటుందని, ఆయన గుర్తులు చెరిపేయడమంటే హైదరాబాద్ నుంచి ఐటీ పరిశ్రమలను తరిమేయడమేనని ఆయన చెప్పారు. కేటీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ నేతల లాగులుతడుస్తున్నాయని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఆయనపై  అక్కసు తోనే కాంగ్రెస్ టార్గెట్ చేసిందని,ఏ తప్పు చేయక పోయినా అక్రమ కేసులతో వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. చివరకు కేటీఆర్ బర్త్ డే వేడుకలపైనా విషం కక్కిన సీఎం రేవంత్ రెడ్డి  కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను  తొలగించే చిల్లర  పనికి ఒడిగట్టారని ఆయన ధ్వజమెత్తారు. హైడ్రాను ఆదేశించి నగరంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపి వేయించారని ఆయన చెప్పారు. కానీ వాటి పక్కనే ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల పోస్టర్లను మాత్రం వదిలేశారనీ, బీజేపీ మంత్రి కిషన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ, ఇతర కాంగ్రెస్‌ నాయకుల ఫ్లెక్సీలను అసలు ముట్టు కోలేదని ఆయన పేర్కొంటూ, కేటీ ఆర్‌ ఫ్లెక్సీలపై హైడ్రా అధికారుల తీరును ఖండించారు. కేటీఆర్‌ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎక్కడ కనబడ్డా వెంటనే తీసేయాలని తెలంగాణ సీఎంవో నుంచి డైరెక్ట్‌ గా ఆదేశాలు వచ్చాయని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులే చెబుతున్నారని ఆయన చెప్పారు.  కేటీఆర్‌ ఫ్లెక్సీలను చించొచ్చేమో కానీ కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని  పోగొట్టలేరని ఆయన  స్పష్టం చేశారు. కాంగ్రెస్ అరాచక పాలన అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

పంట కొంటారా? కొనరా?
విశ్వంభర, ఆర్మూర్: రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటలను  కొంటారో? కొనరో? సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
తమ పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నా ఈ ఇందిరమ్మ రాజ్యానికి  ఇసుమంత కనికరం కూడా లేదని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం రోడ్లపై, కల్లాల్లో మండుతున్న ఎండలకు ఎండుతూ తూకం తగ్గుతోందని, అకాల వానలకు తడిచి ముద్దవుతోందని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి అన్నదాతల ఆరుగాలం శ్రమ ఆవిరవుతోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేకేశ్వర్, ఆలూర్, నందిపేట్ ఆర్మూర్ రూరల్ తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి పంట పండించారని ఆయన తెలిపారు. అయితే ధాన్యం  కొనేదిక్కులేక రైతుల దైన్యం వర్ణనాతీతమని ఆయన చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు.  అటు ఐకేపీలు, ఇటు సొసైటీలు ఎవరికి వారుగా కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ కల్లాలపై ధాన్యం రాశులు మాత్రం కదలడం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారని, రైతులను అవమానిస్తున్నారని, ధాన్యం అమ్ముడుపోక రైతులు నానా అవస్థలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు
క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న దయనీయ పరిస్థితి చూస్తుంటే పంటల కొనుగోలుపై సర్కార్ మాటలు నీటిమూటలేనని విధితమవుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. చివరి గింజ వరకూ కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే అరిగిపోయిన రికార్డును పదేపదే వినిపిస్తున్నా ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని, గన్నీ బ్యాగులు, కాంటాలు, లారీలు కనిపించడం లేదని ఆయన తెలిపారు.
ఇకనైనా గిట్టుబాటు ధరకు పంటంతా కొనకపోతే రైతాంగం ఆందోళన బాట పట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు.  అన్నదాతల ఆగ్రహాన్ని సర్కార్ చవి చూడకతప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

పార్టీని వీడే ప్రసక్తే లేదు.. భట్టితో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజీనామా సస్పెన్స్ కు ఎట్టకేలకు తెర దించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉదయం నుంచి ఆయన రాజీనామా డ్రామా నడుస్తోంది.

ఎందుకంటే జగిత్యాల నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి చాలా అసంతృప్తితో ఉన్నారు. తనను మాట మాత్రం అయినా అడగకుండా తన ప్రత్యర్థిని చేర్చుకోవడం తనను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.

తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు అలెర్ట్ అయ్యారు. మంగళవారం ఉదయమే వందలాది మంది నేతలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దంటూ వారు నచ్చజెప్పడంతో జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు !
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారంటూ ఓ వ్యక్తి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం.. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 32, 35, 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు. అయితే, దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఫంక్షన్ హాల్‌ను కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు సమాచారం.

అయితే, కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్‌ను జీవన్ రెడ్డి కాపలా పెట్టాడు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై దాడికి దిగారు పంజాబీ గ్యాంగ్.. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని.. జీవన్‌రెడ్డి అనుచరులు బయభ్రాంతులకు గురిచేశారని బాధిడుతు తెలిపాడు. దీంతో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీసులు ఆరు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.