Anantapur Collectorate - Vishvambhara News

నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?
Anantapur Collectorate: అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఓ మహిళా ఉద్యోగి విధి నిర్వహణ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను నమోదు చేయాల్సిన సమయంలో సదరు ఉద్యోగి సెల్‌ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలు చూస్తూ మరో ఉద్యోగితో ముచ్చట్లు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రీవెన్స్‌ కార్యక్రమానికి వస్తుంటే.. వారికి సహకరించాల్సిన సిబ్బంది విధుల సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై వార్తా కథనాలు వెలువడి నాలుగు రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియో ఇదిగో.......

విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై జిల్లా కలెక్టర్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే గ్రీవెన్స్‌ కార్యక్రమంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా.. బాధితులను పట్టించుకోకుండా వ్యక్తిగత విషయాల్లో నిమగ్నం కావడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అంటున్నారు. గతంలోనూ కలెక్టరేట్‌ సిబ్బంది విధి నిర్వహణపై విమర్శలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.