Tadipatri Vehicle Checking - Vishvambhara News

తాడిపత్రి కడప రోడ్డులో పోలీసుల తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
Tadipatri Police: అనంతపురం జిల్లా తాడిపత్రి: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణ పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కడప రోడ్డు శ్రీ వాసవి సర్కిల్‌ వద్ద చేపట్టిన ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను కూడా పోలీసులు పరిశీలించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి చలాన్లు విధించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించడంతో పాటు వాహనానికి సంబంధించిన ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కలిగి ఉండాలని తెలిపారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అదేవిధంగా మైనర్‌ బాలలకు ద్విచక్ర వాహనాలు అప్పగించి రోడ్లపైకి పంపించే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నారుల భద్రతతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ గంగరాజుతో పాటు కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, కాటమయ్య, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.