Died - Vishvambhara News

బారామతి 'బాహుబలి'.. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: "ఫైల్ ఎక్కడా ఆగకూడదు.. పని జరగాల్సిందే" అని అధికారులను పరుగులు పెట్టించే మొండితనం, పరిపాలనలో పట్టు, సమయపాలనలో కచ్చితత్వం.. ఇవి అజిత్ పవార్‌ను మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టాయి. బారామతి గడ్డ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే వరకు అప్రతిహతంగా సాగింది.

రాజకీయ అరంగేట్రం.. బాబాయ్ నీడలో
1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా డియోలాలి ప్రవరలో అజిత్ అనంతరావు పవార్ జన్మించారు. శివాజీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. తన బాబాయ్ శరద్ పవార్ స్ఫూర్తితో 1982లో సహకార చక్కెర కర్మాగార బోర్డు సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1991లో పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌గా విజయం సాధించారు. 1991లోనే బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మొదటిసారి లోక్‌సభకు అజిత పవార్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని శరద్ పవార్ కోసం వదులకొని రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి బారామతిని తన కంచుకోటగా మార్చుకున్నారు.

రికార్డు స్థాయిలో డిప్యూటీ సీఎం
మహారాష్ట్ర చరిత్రలో ఆరు పర్యాయాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు అజిత్ పవార్. భావజాలం ఏదైనా, ప్రభుత్వం ఎవరిదైనా ఆయన ఉంటేనే పాలన సాధ్యమనే స్థాయికి ఎదిగారు. పృథ్వీరాజ్ చవాన్, ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి భిన్న ముఖ్యమంత్రుల వద్ద డిప్యూటీ సీఎంగా పనిచేసి తన పరిపాలనా దక్షతను నిరూపించుకున్నారు. నీటిపారుదల, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1991-1992 మధ్య వ్యవసాయ, విద్యుత్ శాఖ మంత్రిగా అజిత్ పవార్ పనిచేశారు. 1992లో శరద్ పవార్ సీఎంగా ఉండగా, విద్యుత్, ప్రణాళిక శాఖ సహాయ మంత్రి అయ్యారు. 1999లో, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖకు మంత్రిగా వ్యవహరించారు. 2003లో సుశీల్ కుమార్ షిండే మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత విలాశ్ రావు దేశ్ ముఖ్, అశోక్ చవాన్ ప్రభుత్వాలలో జల వనరుల శాఖ మంత్రిగా పని చేశారు.

సంచలన మలుపులు
అజిత్ పవార్ రాజకీయ జీవితం ఎప్పుడూ ఒక ప్రవాహంలా సాగలేదు. అందులో ఎన్నో ఒడిదుడుకులు, సంచలనాలు ఉన్నాయి. 2019లోమహారాష్ట్రలో హంగ్ ఫలితాలు రావడంతో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ విడిపోయి బీజేపీతో కలిసి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి తెల్లవారుజామున డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ ప్రభుత్వం 80 గంటలకే కూలిపోయినా, ఆయనకున్న 'పవర్' ఏంటో అందరికీ తెలిసింది. 2023లో బాబాయ్ శరద్ పవార్‌తో విభేదించి, ఎన్సీపీని తన పక్షాన తిప్పుకుని అధికారిక చిహ్నాన్ని (గడియారం) దక్కించుకోవడం ఆయన రాజకీయ చతురతకు పరాకాష్ట. 2024 ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఏం పదవి చేపట్టారు. ఇదిలా ఉండగా తాజా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ- శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీఎస్పీ కలిసి పోటీ చేశాయి. కానీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.

వచ్చే నెలలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న తరుణంలో, తన సొంత నియోజకవర్గం బారామతిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ అంటే కేవలం ఒక నాయకుడు కాదు, అది ఒక పని చేసే యంత్రమని తెలిపారు. మహారాష్ట్ర పరిపాలనలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) ఇకలేరు. బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణం తోడవడంతో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం పుణె సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. బారామతిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రమాదం జరిగిన సమయమిదే
వచ్చే నెలలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబయి నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో తన సొంత నియోజకవర్గమైన బారామతికి బయలుదేరారు. ఉదయం 8:10 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. 8:25 గంటలకు మార్గమధ్యంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 8:30 గంటలకు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు పైలట్ మొదటి ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. పరిస్థితి విషమించడంతో రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించగా, విమానం నియంత్రణ కోల్పోయి రన్‌వేకు సమీపంలోని కొండ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం అదుపు తప్పి ఒక భారీ బండరాయిని బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎగిసిపడటంతో విమానం తోక భాగం మినహా అంతా కాలిబూడిదయింది.

విజిబిలిటీ తక్కువగా ఉండటమే శాపమా?
ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ముంబై పీఎస్‌వో వదీప్ జాదవ్, పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, కో-పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో పుణె, బారామతి పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ (కనిపించే దూరం) చాలా తక్కువగా ఉండటంతో పైలట్ రన్‌వేను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

కుట్ర కోణంపై అనుమానాలు?
సాంకేతిక లోపమే ప్రాథమిక కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ ప్రమాదంపై రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ పవార్ మళ్లీ శరద్ పవార్‌తో కలిసి 'మహా వికాస్ అఘాడీ' కూటమిలోకి వస్తారంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో వేడి పుట్టించాయి. పవార్ కుటుంబాల కలయికపై చర్చ జరుగుతున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ప్రమాదానికి గురైన విమానం ప్రత్యేకతలు
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం వీఎస్ఆర్ వెంచర్స్ యాజమాన్యంలోని లియర్ జెట్ 45XR. ఈ విమానాన్ని బాంబార్డియర్ ఏరో స్పేస్ తయారీ చేసింది. దీనిలో ఎనిమిది మంది ప్రయాణించే వీలుంది. 51,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉంటుంది. ఫ్లైట్ ట్రాకర్ 'Flightradar24' ప్రకారం.. విమానం రెండోసారి ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీరని లోటుగా మిగిలిపోయింది.

భారీ పేలుళ్లు: ప్రత్యక్ష సాక్షి
విమానం కిందకు దిగుతుంటే అది ప్రమాదానికి గురవుతుందనిపించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. విమానం నేలను తాకిన తర్వాత పలు మార్లు పేలుడు శబ్ధాలు వినిపించాయని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చినా భారీ అగ్ని కీలల కారణంగా ఎవరినీ కాపాడలేకపోయినట్లు చెప్పారు.

విషాదం.. 10 మంది జవాన్ల మరణం!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత సైన్యానికి చెందిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ హృదయవిదారక ఘటనలో 10 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే వీరజవాన్ల మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. భదేర్వా-చంబా రహదారిలోని 'ఖన్నీ' పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 9 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సైనికులతో వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక శిఖరం పైభాగానికి చేరుకున్న సమయంలో మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం ఒక్కసారిగా 200 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందిన వెంటనే సైన్యం, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిన వాహనం నుంచి జవాన్లను వెలికితీయడం క్లిష్టతరంగా మారింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
ప్రమాద స్థలంలోనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారిని అత్యవసరంగా హెలికాప్టర్ల ద్వారా ఉధంపుర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఆరుగురు జవాన్లు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 11 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రముఖుల నివాళులు
ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో మన సైనికులను కోల్పోవడం అత్యంత బాధాకరమని అమిత్ షా పేర్కొన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా జవాన్ల మృతికి సంతాపం ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని వారు పేర్కొన్నారు.

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోల హతం!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: మావోయిస్టుల అగ్రదుర్గంగా భావించే ఝార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గురువారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మట్టుబెట్టాయి. ఇందులో అత్యంత కీలకమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ దా మరణించారు. కాగా, పతిరామ్‌ మాంఝీపై రూ.5 కోట్లు రివార్డు ఉంది. చైబాసా జిల్లా కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన సారండా అడవుల్లో మావోయిస్టుల సంచారం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో సీఆర్​పీఎఫ్, రాష్ట్ర భద్రతా దళాలు సంయుక్తంగా 'యాంటీ నక్సల్ ఆపరేషన్' ప్రారంభించాయి. బలగాలు అడవిని చుట్టుముడుతుండగా, మావోయిస్టులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగడంతో గంటల తరబడి కాల్పులు కొనసాగాయి.

అగ్రనేతల వేట.. సారండానే లక్ష్యం
ఝార్ఖండ్‌ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడానికి సారండా ప్రాంతమే ప్రధాన అడ్డంకిగా మారింది. సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీతో పాటు రూ.50 లక్షల రివార్డు ఉన్న మరో సీనియర్ కమాండర్ కూడా ఈ కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అడవుల్లో రూ.కోటి రివార్డు ఉన్న పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెసరా నాయకత్వంలో సుమారు 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు అదనపు బలగాలను మోహరించారు.

పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన
"ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల పూర్తి వివరాలు తెలియడానికి సమయం పడుతుంది. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాము. ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తాము" అని కొల్హాన్ డీఐజీ అనురంజన్ తెలిపారు.

వరుస ఎన్‌కౌంటర్లతో మావోలు విలవిల
గడిచిన కొద్ది రోజులుగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ఉధృతమయ్యాయి. జనవరి 3న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2025లో ఒక్క బస్తర్ డివిజన్‌లోనే దాదాపు 256 మంది మావోయిస్టులు హతమవ్వగా, వందలాది ఆటోమేటిక్ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఇంటర్నెట్ సేన్సేషనల్ డాగ్ కబోసు మృతి!
పాపులర్ మీమ్ డాగ్ కబోసు మృతిచెందింది. గత కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మృతిచెందినట్లు డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. కాగా, ప్రపంచంలో సంచలనం సృష్టించిన కబోసు.. సోషల్‌ మీడియాలో 'వైరల్ డాగీ'గా పేరు పొందింది. క్రిప్టో కరెన్సీ డాగీకాయిన్ లోగోలోనూ దీని ఫొటో ఉండేది.

మీమ్ ప్రపంచంలో భారతీయ నెటిజన్లకు ‘చిమ్‌టూ’గా ఈ శునకం సుపరిచితం. ఈ శునకం థీమ్‌తో రూపొందించిన మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా క్రికెట్, సినిమా, రాజకీయాలు, యూత్ అంశాలు, భార్యాభర్తలు, ప్రేమికుల జోక్స్‌ను చిమ్‌టూ ఫొటోలతో మీమర్స్ రూపొందించేవారు. పలు సోషల్ మీడియా యాప్‌లు సైతం ప్రత్యేకంగా చిమ్‌టూ స్టిక్కర్లను తీసుకొచ్చాయి.

అదేవిధంగా చిమ్‌టూ మృతిపట్ల డాగీకాయిన్ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘తమ కమ్యూనిటీ భాగస్వామి, స్నేహితురాలు కబోసు ప్రశాంతంగా కన్నుమూసింది. అపరిమితమైన సంతోషం, ప్రేమకు కబోసు చిరునామా. మీమ్ వరల్డ్‌లో తనదైన ముద్రవేసింది. అది ఎప్పుడూ మీ గుండెల్లో నిలిచిపోతుంది’. అని డాగీకాయిన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.