Alipiri Tirumala Footpath - Vishvambhara News

తిరుమల నడకమార్గంలో AI రోబోట్‌ డాగ్‌
Tirumala AI Robot Dog: తిరుమలలో భక్తుల భద్రతను మరింత పెంచేందుకు టీటీడీ సరికొత్త సాంకేతికతను వినియోగించే దిశగా ఆలోచిస్తోంది. అలిపిరి–తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఇతర వన్యప్రాణుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టేందుకు ‘AI రోబోట్‌ డాగ్‌’ వినియోగాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి భక్తులు, అటవీ సిబ్బందికి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

ఈ AI రోబోట్‌ డాగ్‌ను LiDAR, ఆప్టికల్‌ కెమెరాలు, థర్మల్‌ కెమెరాలు, వివిధ సెన్సర్లతో రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీటి ద్వారా చీకటి, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ మనుషులు, జంతువులు, వాహనాలను వేర్వేరుగా గుర్తించే సామర్థ్యం ఉండనుంది. రోబోట్‌ గుర్తించిన దృశ్యాలను లైవ్‌ వీడియో ఫీడ్‌ రూపంలో కంట్రోల్‌ రూమ్‌కు పంపేలా వ్యవస్థను రూపొందించే అవకాశం ఉంది.

నడకమార్గంలో చిరుత లేదా ఇతర క్రూర మృగాల కదలికలను గుర్తించిన వెంటనే కంట్రోల్‌ రూమ్‌తో పాటు పెట్రోలింగ్‌ సిబ్బందికి జియో ట్యాగ్డ్‌ అలర్ట్‌లు పంపే విధంగా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడంపై టీటీడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రమాదం ఉన్న ప్రాంతాన్ని సిబ్బంది ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

అటవీ సిబ్బంది ప్రాణాలకు ముప్పు లేకుండా వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడం, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత సురక్షితంగా నిర్వహించడం కూడా ఈ సాంకేతికత లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా రోబోట్‌కు అనుసంధానించే సౌండ్‌, లైట్‌ సిస్టమ్‌ ద్వారా క్రూర మృగాలను భక్తులు సంచరించే ప్రాంతాల వైపు రాకుండా నియంత్రించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే తిరుమల నడకమార్గంలో భక్తుల భద్రతకు మరింత రక్షణ కల్పించే అవకాశం ఉంది.