Kavitha - Vishvambhara News

భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
Kalvakuntla Kavitha: తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే పేదలకు భూపంపిణీ జరగాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. భూమి లేని పేద కుటుంబాలకు భూమి అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసాతో పాటు ఆత్మగౌరవాన్ని కల్పించవచ్చని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధించాలంటే పేదలకు భూమిపై హక్కు కల్పించడం అత్యంత కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ దిశగా టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న ‘భూలక్ష్మి’ పథకం విప్లవాత్మకమైన ఆలోచనగా కవిత అభివర్ణించారు.

భూమి లేని ప్రతి పేదింటి కుటుంబానికి ఎకరం భూమిని అందించడమే భూలక్ష్మి పథకం ప్రధాన లక్ష్యమని కవిత తెలిపారు. భూమి ఉంటే పేద కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవనోపాధిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని, భూమి ద్వారా వారి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పు తీసుకురావచ్చని అన్నారు. కేవలం సంక్షేమ పథకాలతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేమని, పేదలకు శాశ్వత ఆస్తి కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భూమి లేని కుటుంబాలకు ఎకరం భూమి అందించడం ద్వారా వారి భవిష్యత్ తరాలకు కూడా ఒక భరోసా ఏర్పడుతుందని తెలిపారు.

తెలంగాణ రక్షణ సేన లక్ష్యం కూడా భూమి లేని ప్రతి పేద కుటుంబానికి భూమి అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమేనని కవిత పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు భూమిపై హక్కు కల్పించడం ద్వారా సమాజంలో అసమానతలను తగ్గించే అవకాశం ఉంటుందని అన్నారు. పేదలకు భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం వంటి అంశాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. ‘భూలక్ష్మి’ పథకం ద్వారా భూమి లేని పేద కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని ఆమె తెలిపారు.

మే మొదటి వారంలో కవిత నూతన రాజకీయ పార్టీ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన కవిత ఇష్టాగోష్టిలో కీలక వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. సుమారు 19 ఏళ్లుగా సామాజిక, సాంస్కృతిక సేవలో ఉన్న తెలంగాణ జాగృతి, ఇకపై రాజకీయ క్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

'తెలంగాణ' పేరుతోనే ఇంటి పార్టీ
పార్టీ పేరుపై వస్తున్న ఊహాగానాలపై కవిత స్పందిస్తూ.. తాను స్థాపించబోయే పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఉంటుందని కవిత ధృవీకరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పార్టీల్లో తెలంగాణ అనే పదం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ లేకుండా పోయిందని అన్నారు. అందుకే తెలంగాణ పేరును తన పార్టీలో పెట్టాలనుకుంటున్నానని తెలిపారు. బీఆర్ఎస్ విధానాలతో విభేదించి బయటకు వచ్చిన తాను, ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. శాసనమండలిలో రాజీనామా ఆమోదం పొందే ముందు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని, ఒక రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే కొత్త ప్రత్యామ్నాయం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

సిద్దిపేట నుంచే కవిత పోటీ?
తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుందని, తాను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. అభ్యర్థిగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతూనే, తన ప్రాధాన్యతలను వెల్లడించారు. పోటీకి సంబంధించి మొదటి చాయిస్‌గా సిద్దిపేటను, రెండో చాయిస్‌గా బోధన్‌ను ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ అంతటా పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ఇప్పటికే జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కేవలం ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి కనుసన్నల్లో కాకుండా, స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేసే రాజకీయ వ్యవస్థను నిర్మిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏప్రిల్ లేదా మే నాటికి పార్టీ విధివిధానాలు, జెండా, ఎజెండాను పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.

ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను కర్ణాటకలోని దావణగెరెకు తరలించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.

ఈ నెల 24న చలో సెక్రటేరియట్‌కు మద్దతు
బీఆర్ఎస్ హయాంలో కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే యూనియన్లను రద్దు చేసిన అంశాన్ని గుర్తు చేశారు. కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే యూనియన్లను తిరిగి ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోవడం శోచనీయమన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఈ నెల 24న తలపెట్టిన చలో సెక్రటేరియట్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కవిత వెల్లడించారు.

కాంగ్రెస్ విజయానికి బీఆర్ఎస్ వైఫల్యమే కారణం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పూర్తి వైఫల్యమే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ ఫలితాలు బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు తొలి మెట్టుగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గతంలో తోక పార్టీలుగా భావించిన సీపీఎం, సీపీఐలను ఇప్పుడు బీఆర్ఎస్ ఆశ్రయిస్తోందని విమర్శించారు. నిజామాబాద్‌తో సహా పలు చోట్ల బీఆర్ఎస్ కేడర్ పూర్తిగా నిర్వీర్యమైందని, కేటీఆర్ కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదని విమర్శించారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాటం శూన్యం

ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని కవిత ఆరోపించారు. అయినా బీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల మూడో, నాలుగో స్థానానికి పరిమితమైందని ఎద్దేవా చేశారు. కూనంనేని సాంబశివరావు కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై ఏం మాట్లాడారో కేటీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఎక్కడ పోరాటం చేస్తోందో చెప్పాలని నిలదీశారు. కరీంనగర్‌లో మినహాయిస్తే బీజేపీ ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తొందరపడి కారు కూతలు కూయకుండా, తప్పులు సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

ప్రలోభాలకు గురిచేశారు.. జాగృతి విజయంపై కవిత
ఈ ఎన్నికల్లో ప్రజలు 40కి పైగా స్థానాల్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించారని కవిత వెల్లడించారు. వడ్డేపల్లిలో తమకు పూర్తి ఆధిక్యం వచ్చినప్పటికీ, అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపించారు. 16 మున్సిపాలిటీలు రావడమే ఎక్కువ అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు తమను ఆదరిస్తున్నారన్న విశ్వాసం కలుగుతోందని తెలిపారు.

సింగరేణిలో జాగృతి, హెచ్ఎంఎస్ పొత్తు
రేవంత్ రెడ్డి తానే రాజు - తానే మంత్రి అన్నట్లు కాకుండా, హామీల అమలుపై దృష్టి పెట్టాలని కవిత కోరారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, పిక్చర్ ఇంకా ముందుందని హెచ్చరించారు. భవిష్యత్తులో సింగరేణి ఎన్నికల్లో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి పోటీ చేసి సత్తా చాటుతామని ప్రకటించారు. సింగరేణి కుంభకోణంపై సీపీఐ, ఏఐటీయూసీ కనీసం నోరు కూడా విప్పలేదని కవిత ఆరోపించారు.

గద్వాల గడ్డపై 'సింహం' గర్జన
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని సంచలనం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుదారులు ఇక్కడ ప్రభంజనం సృష్టించి, మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకున్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, ఫలితాలు కవిత మద్దతుదారులకు ఏకపక్షంగా అనుకూలించాయి. కవిత  మద్దతుదారులు 8 వార్డుల్లో గెలుపొందగా, అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక వార్డుకు పరిమితం కాగా, బీఆర్ఎస్ కూడా ఒకే ఒక్క స్థానంలో గెలిచింది.

'సింహం' గుర్తుతో స్వతంత్ర పంథా
ఈ ఎన్నికల్లో కవిత అనుచరులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున 'సింహం' గుర్తుపై పోటీ చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కవితకు ఉన్న ప్రజాధారణ ముందు అవేవీ నిలవలేదు. తెలంగాణ జాగృతి ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలే తమను గెలిపించాయని విజేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, కవితమ్మ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని గెలుపొందిన అభ్యర్థులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తాము చేసిన సేవను గుర్తించి ఓటర్లు తమకు పట్టం కట్టారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు సాగుతుంటే, వడ్డేపల్లిలో మాత్రం ఒక మూడవ వర్గం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోసినట్లయింది. ఫలితాలు వెలువడగానే వడ్డేపల్లి పట్టణంలో కవిత మద్దతుదారులు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

త్వరలో కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచారు. బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన 'ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ'లో పాల్గొన్న ఆమె, గత పదేళ్ల పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు
ఉద్యమకారుల విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై కవిత విమర్శలు గుప్పించారు. పదేళ్ల కాలంలో ఉద్యమకారులకు అన్ని చేదు జ్ఞాపకాలే మిగిలాయని, వారికి సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవాళ్లే గాయం చేస్తే ఆ నొప్పి ఎక్కువగా ఉంటుందని.. ఉద్యమకారులు బయట ఉండి బాధపడితే, తాను బీఆర్ఎస్‌లో ఉండి బాధపడ్డానని పేర్కొన్నారు. అహంకారం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని విశ్లేషించారు. మంచితనం, భోళాతనం తెలంగాణ తత్వమని, అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లేనని స్పష్టం చేశారు.

త్వరలో రాజకీయ పార్టీ.. అస్తిత్వమే ఊపిరి
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు కవిత వెల్లడించారు. ఇది కేవలం ఎన్నికల కోసం పెట్టే ఫక్తు రాజకీయ పార్టీ కాదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే వేదిక అని వివరించారు. 1995 వరంగల్ డిక్లరేషన్‌తో మొదలైన మలిదశ ఉద్యమంలో మారోజు వీరన్న, గద్దర్ వంటి విప్లవకారుల పాత్రను గుర్తుచేస్తూ, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

ప్రొఫెసర్ కోదండరామ్‌కు హెచ్చరిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమ సోయి లేదని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే రాబోయే బడ్జెట్ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే తాను రేవంత్ రెడ్డిని కాదని, ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళిని హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు. వీరిద్దరూ రేవంత్ రెడ్డితో కలవబట్టే కాంగ్రెస్‌ను నమ్మామని.. కానీ రెండేళ్లుగా వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు రేవంత్ రెడ్డిని భవనం నుంచి బయటకు లాగుతారని వ్యాఖ్యానించారు.

20 శాతం రిజర్వేషన్ డిమాండ్
తెలంగాణ బిడ్డలకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు కల్పించడంలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై, కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోవడం బాధాకరమని, నాడు మున్సిపల్ మంత్రిని కోరినా ఫలితం లేకపోయిందని గుర్తుచేశారు. తెలంగాణ గడ్డ నిత్యం పోరాటాల గడ్డ అని, ఉద్యమకారుల కోసం మరో పోరాటం తప్పదని పిలుపునిచ్చారు.

మూడు నెలల్లో కవిత 'కొత్త పార్టీ'
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సిద్ధమవుతున్నామని, ఇందుకోసం మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నామని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్.. 'పెద్ద చేప' ఎవరు?
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత ఘాటుగా స్పందించారు. "ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించిన అసలు 'పెద్ద చేప'ను వదిలేసి, ప్రణీత్ రావు వంటి చిన్న చేపలను పట్టుకోవడం ఏంటి?" అని సిట్ దర్యాప్తును ప్రశ్నించారు. ఈ కేసును ప్రభుత్వం టీవీ సీరియల్‌లా సాగదీస్తోందని, నిందితులను కేవలం డిమోట్ చేసి వదిలేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ వైఫల్యంపై నిప్పులు
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని కవిత ఆరోపించారు. ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పారు. 2025-26 బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా, ఆశించిన స్థాయిలో రూ.20 వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.

కేసీఆర్ చరిత్ర.. రేవంత్ రెడ్డికి సవాల్
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పాత్ర అజరామరమని, ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయని, ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని మండిపడ్డారు. ప్రజలు ప్రశ్నించే గొంతుకలైన స్వతంత్రులకు, సీపీఎం వంటి పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆమె సూచించారు.

12న 'ఆత్మగౌరవ సభ'
తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో 'తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ' నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సభ ద్వారా తెలంగాణ వాదులందరినీ ఏకం చేసి, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించనున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కవిత పేరు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ప్రశ్నించిన సిట్ అధికారులు, జోగినపల్లి సంతోష్ రావు విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారు. అక్రమ నిఘా ద్వారా సంపాదించిన సమాచారంతో భారీ భూ కుంభకోణాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి.

కవిత పేరు ప్రస్తావన

ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేరు ప్రస్తావనకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల వల్ల డిజిటల్ ఆధారాలు దొరికిపోతాయని ఆమె గతంలోనే ఒక మాజీ మంత్రిని హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ప్రమేయం ఉన్న భూ లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది. ఈ అక్రమాలపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి సమాచారాన్ని సేకరించింది.

ధరణి ద్వారా భూ దందాలు

అక్రమ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని అడ్డం పెట్టుకుని రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల సెటిల్మెంట్లు చేసినట్లు సిట్ గుర్తించింది. ధరణి పోర్టల్‌ను ఆయుధంగా చేసుకుని రాత్రికి రాత్రే భూ హక్కులను మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు అందిన ఆదేశాల మేరకు వివాదాల్లో ఉన్న వ్యక్తులను బెదిరించి ఈ సెటిల్మెంట్లు చేయించినట్లు తెలుస్తోంది.

తదుపరి అడుగు ఎటు?

కేసీఆర్ లాంటి అగ్రనేతల స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన అధికారులు, ఇప్పుడు కవితను విచారిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న భూ కుంభకోణాలు, మనీ లాండరింగ్ కోణాలు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. సిట్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

డైలీ సీరియల్‌లా సిట్ విచారణ
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని ఆమె విమర్శించారు.

ఈ కేసు విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, సిట్ విచారణ అసలు సీరియస్‌గా జరగడం లేదని మండిపడ్డారు. ఒక ముఖ్యమైన కేసును త్వరగా ముగించకుండా, ప్రభుత్వం దీనిని ఒక ‘డైలీ సీరియల్’ లాగా కావాలనే సాగదీస్తోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం అనేది ముమ్మాటికీ తప్పేనని, దానిని ఎవరూ సమర్థించబోరని స్పష్టం చేసిన ఆమె, అయితే ఈ కేసులో అసలైన నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఇంకెన్నాళ్లు నాన్చుతారో చూస్తామని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

సంతోష్‌ రావు ఓ ‘గూఢచారి’.. ఆ దెయ్యం ఆయనే!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. సంతోష్‌ రావు ఒక "గూఢచారి" అని విమర్శించారు. ఉద్యమకారులకు, ఉద్యమ నాయకుడికి మధ్య ఆయనే అడ్డుగోడగా మారారని సంచలన ఆరోపణలు చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.

"ఉద్యమ నాయకుడిని (కేసీఆర్) సొంత కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు దూరం చేసింది సంతోష్ రావే. గద్దర్ వంటి గొప్ప నాయకులు కూడా ప్రగతి భవన్ గేటు బయట నిలబడాల్సి వచ్చిందంటే దానికి కారణం ఆయనే" అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారిగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మొదటి నుంచి చెబుతున్న 'దెయ్యం' ఆయనే. ఇప్పుడు అది రుజువవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో స్పందించారు. సిట్ ఆయనకు ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలని.. కానీ, ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం తనకు లేదంటూ విచారణ తీరుపై సందేహాలు వ్యక్తం చేశారు.

క్షీణించిన శాంతిభద్రతలు
రాష్ట్ర ప్రభుత్వంపై కవిత విమర్శలు గుప్పించారు. ఎక్సైజ్ పోలీసులు, అటవీ శాఖ సిబ్బందిపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్మగ్లర్లకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని, గంజాయి సరఫరాదారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఎక్సైజ్, అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తేనే నేరగాళ్లలో భయం ఉంటుందని కవిత సూచించారు. రాష్ట్రంలో గృహ హింస పెరిగిపోతోందని, ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నైనీ టెండర్ల విషయంలో హరీశ్ రావు వైఖరిని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. "భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా 'గుంట నక్క' (హరీశ్ రావు) రంగంలోకి దిగారు. ఆ మాటలను గుడ్డిగా నమ్మి కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు" అని ఎద్దేవా చేశారు.

ఈ వ్యవహారంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేప మాత్రమేనని, అసలు తిమింగలం లాంటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడేందుకే హరీశ్ రావు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఒక కాంట్రాక్టర్‌కు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ ఆవేదన చెందడం హాస్యాస్పదమని మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరుపై కవిత సెటైర్లు వేశారు. ఈ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతూ.. ఏళ్ల తరబడి సాగే 'కార్తీకదీపం' సీరియల్‌ను తలపిస్తోందని విమర్శించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే దీనిని వాడుకుంటున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాల కోసం వాడటం సరికాదని, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కొత్త పార్టీపై సంకేతాలు: ‘జాగృతి పార్టీ’లో చేరండి!

తన రాజకీయ భవిష్యత్తుపై కవిత స్పష్టతనిస్తూనే, కొత్త పార్టీ పేరుపై హింట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరుతానన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. "నేను కాంగ్రెస్‌లో చేరను. మీరే జాగృతి పార్టీలో చేరండి. భవిష్యత్తులో నేను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీకు కీలక పదవి ఇస్తా" అని వ్యాఖ్యానించారు. దీనితో ఆమె స్థాపించబోయే కొత్త పార్టీ పేరు 'తెలంగాణ జాగృతి'అని ఉండబోతోందనే చర్చ మొదలైంది.

మున్సిపల్ పోరులో 'సింహం' గర్జన?
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఆమె వేస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసిన కవిత, ఇంకా పార్టీ పేరును అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే, మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ, తన అనుచరులను ఏ గుర్తుపై బరిలోకి దింపాలనే అంశంపై ఆమె ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)నేతలతో కవిత భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఎందుకు 'సింహం' గుర్తుపైనే మోజు?
రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ధీటుగా నిలబడాలంటే ఒక శక్తివంతమైన గుర్తు అవసరమని కవిత భావిస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి క్షేత్రస్థాయిలో భారీ క్యాడర్ లేకపోయినా, దాని 'సింహం' గుర్తుకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో రామగుండంలో కోరుకంటి చందర్ ఇదే గుర్తుపై గెలిచి తన సత్తా చాటారు. 2019 పరిషత్ ఎన్నికల్లో ఈ పార్టీ ఏకంగా 25 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడం విశేషం. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులకు, రెబల్ నేతలకు ఈ 'సింహం' గుర్తు ఒక ఆయుధంగా మారుతోంది.

చట్టసభల్లోకి 'ఒంటరి' పోరాటం!
శాసనమండలిలో తన చివరి ప్రసంగంలో "ఒంటరిగా వెళ్లి తిరుగులేని శక్తిగా తిరిగి వస్తాను" అని ప్రకటించిన కవిత, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ నివాసంలో ఆశావహులతో భేటీ అయ్యి, ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఫార్వర్డ్ బ్లాక్ మద్దతుతో లేదా ఆ పార్టీ బి-ఫారమ్‌లతో జాగృతి నేతలు బరిలోకి దిగితే, అది అధికార, ప్రతిపక్ష పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టే అవకాశం ఉంది.

తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్న కవితకు, ఈ 'సింహం' గుర్తు ఏ మేరకు కలిసి వస్తుంది? ప్రజలు ఆమె కొత్త ప్రయాణాన్ని ఎలా ఆదరిస్తారు? అనేది తెలియాలంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశం
విశ్వంభర,హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు సృష్టించిన రాజకీయ ప్రకంపనల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం నగరానికి చేరుకున్న హరీశ్‌రావు  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.

కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న హరీశ్‌రావు తిరిగి రాగానే ఈ అంశంపై కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కేసీఆర్‌కు పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే, ఈ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హరీశ్‌రావుకు మద్దతుగా నిలవడం గమనార్హం. పార్టీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హరీశ్‌రావుకు బాసటగా పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారంలో కేసీఆర్ మద్దతు ఆయనకే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య కేసీఆర్, హరీశ్ రావు భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.