Nagarjuna Public School - Vishvambhara News

ప్రిన్సిపల్‌ను చంపింది టెన్త్ క్లాస్ విద్యార్థులే!.. నల్గొండలో దారుణ హత్య కేసు
Nalgonda Principal Murder: నల్గొండ జిల్లాలో మహిళా ప్రిన్సిపల్ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొండమల్లేపల్లి పట్టణంలోని జేబీ కాలనీలో నివాసం ఉంటూ నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న రూపారెడ్డి (45) ఈ నెల 11న రాత్రి హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఆమె భర్త హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇంట్లో ఒంటరిగా ఉన్న రూపారెడ్డిపై దుండగులు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో దాదాపు 80 మందిని విచారించిన అనంతరం పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రూపారెడ్డిని ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి హతమార్చినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. నిందితుల కోసం గాలించిన పోలీసులు ఇబ్రహీంపట్నం వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు రూపారెడ్డి పనిచేస్తున్న అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించినట్లు సమాచారం.

అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. హత్య అనంతరం కూడా నిందితులుగా అనుమానిస్తున్న విద్యార్థులు ఎలాంటి అనుమానం రాకుండా పాఠశాలకు వస్తూ, అక్కడి పరిస్థితులను గమనిస్తూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. హత్య అనంతరం ఇంట్లోని సుమారు రూ.4 లక్షల నగదు కూడా కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో నగదు కోసమే ఈ హత్యకు పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముగ్గురు అనుమానితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. ఈ దారుణ హత్య వెనుక అసలు కారణాన్ని బయటపెట్టే పనిలో ఉన్నారు.