Telangana Power Employees - Vishvambhara News

విద్యుత్ ఉద్యోగులకు జెన్‌కో వార్నింగ్.. ధర్నాలు చేస్తే చర్యలు తప్పవు
Telangana Power Employees: తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా నేపథ్యంలో జెన్‌కో కీలక హెచ్చరిక జారీ చేసింది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ జేఏసీ ఈ నెల 19న హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని జెన్‌కో స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై ఎస్మా-1971 చట్టం కింద ఆరు నెలల పాటు నిషేధం అమల్లో ఉందని పేర్కొంది.

విద్యుత్ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సౌధ, జీటీఎస్ కాలనీల్లో ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి లేదని జెన్‌కో తెలిపింది. ఎస్మా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగులు, కార్మికులు ధర్నాలు, సమ్మెలకు దిగితే నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జెన్‌కో డైరెక్టర్ కుమార్ రాజు మంగళవారం మెమో జారీ చేసినట్లు సమాచారం.

మరోవైపు ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహించాలని పవర్ జేఏసీ నిర్ణయించింది. పెండింగ్ సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే ఎస్మా అమల్లో ఉన్నందున ధర్నాకు అనుమతి లేదని జెన్‌కో స్పష్టం చేయడంతో ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై ఉత్కంఠ నెలకొంది. నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేపట్టే ఉద్యోగులు, కార్మికులపై చర్యలు తీసుకుంటామని జెన్‌కో డైరెక్టర్ కుమార్ రాజు హెచ్చరించారు. దీంతో ఈ నెల 19న పవర్ జేఏసీ మహాధర్నా నిర్వహిస్తుందా? లేక జెన్‌కో హెచ్చరికల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.

విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా.. పోస్టర్ ఆవిష్కరించిన జెన్‌కో ఉద్యోగులు
Telangana Power Employees: తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్న విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలని జెన్‌కో ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఘనపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వద్ద మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఉద్యోగులు ఆవిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం మహాధర్నా చేపడుతున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద ఉదయం 11 గంటలకు మహాధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. పీఆర్‌సీ-2026ను అమలు చేయాలని, యాదాద్రి ప్లాంట్‌లో ఔట్‌సోర్సింగ్‌ను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు జీపీఎఫ్, ఈపీఎఫ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా ఒత్తిడి తీసుకురావడమే మహాధర్నా ప్రధాన ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా చెల్పూర్ కేటీపీపీ వద్ద ఉద్యోగులు మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించి తమ డిమాండ్లకు మద్దతుగా నిరసన తెలిపారు.