Government Land - Vishvambhara News

షాబాద్‌లో మట్టి మాఫియా?.. టిప్పర్లతో ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలింపు
Government Land: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. టీజేఐసీసీకి కేటాయించిన ప్రభుత్వ భూమిలో రాత్రివేళ అక్రమంగా మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో యంత్రాలతో మట్టిని తవ్వి పెద్ద ఎత్తున తరలిస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్తుల ఆరోపణల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు టిప్పర్లు వరుసగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రభుత్వ భూమి నుంచి తవ్విన మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు తరలించి విక్రయిస్తున్నారని, ఒక్కో టిప్పర్ మట్టి ట్రిప్పును రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిలో ఇంత పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

అక్రమ మట్టి తవ్వకాల కారణంగా గ్రామంలోని రహదారులు దెబ్బతింటున్నాయని, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళ టిప్పర్ల రాకపోకలతో దుమ్ము, ధూళి పెరిగి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వుతున్నారన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్ స్పందించి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.