Irrigation Water Release - Vishvambhara News

నీళ్లు విడుదల చేయండి.. పంటలు కాపాడండి.. ఎస్‌ఐ కాళ్లు పట్టుకున్న రైతు
Khammam Farmers: ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. వైరా రిజర్వాయర్‌లో 17 అడుగుల మేర నీరు ఉన్నప్పటికీ సాగుకు నీటిని విడుదల చేయడం లేదంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఐబీ కార్యాలయం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. పంటలకు కీలకమైన సమయంలో నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉన్నప్పుడు కూడా సాగుకు నీటిని విడుదల చేయకపోవడంపై అధికారులను ప్రశ్నించారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నిరసన విరమించాలని పోలీసులు సూచించడంతో రైతులు తమ డిమాండ్‌పై పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన ఎస్‌ఐ కాళ్లపై ఓ రైతు పడిపోయి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. సార్.. నీళ్లు విడుదల చేయండి, మా పంటలను కాపాడండి అంటూ ఎస్‌ఐ కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని, వెంటనే అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. తమకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదని, సాగుకు అవసరమైన నీరు మాత్రమే కావాలని స్పష్టం చేశారు.

రిజర్వాయర్‌లో 17 అడుగుల నీరు ఉన్న సమయంలో కూడా సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యం చేస్తే పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరా రిజర్వాయర్ నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో ఐబీ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాగునీటి విడుదలపై అధికారులు వెంటనే నిర్ణయం తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.