Telangana Voters - Vishvambhara News

తెలంగాణలో SIR ప్రక్రియలో భారీ మార్పులు.. 73.39 లక్షల ఓట్లు డ్రాఫ్ట్‌ జాబితా నుంచి తొలగింపు
Telangana SIR: తెలంగాణలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) ప్రక్రియలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. విడుదలైన డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో ఏకంగా 73.39 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. మరోవైపు సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. దీంతో రాష్ట్ర ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి.

2026 జూన్‌ 10 నాటికి తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. ఆగస్టు 10 నాటికి 2,64,87,213 మంది మాత్రమే ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించారు. అంటే మొత్తం ఓటర్లలో 78.30 శాతం మంది తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

డ్రాఫ్ట్‌ జాబితా నుంచి తొలగించిన 73.39 లక్షల మంది ఓటర్లలో 9.22 లక్షల మంది మరణించినవారిగా, 11.25 లక్షల మంది అందుబాటులో లేని లేదా ఆచూకీ లభించని వారిగా గుర్తించారు. మరో 45.18 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా, 6.70 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనవారిగా గుర్తించారు. మరో 1.02 లక్షల మందిని ఇతర కేటగిరీలో చేర్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా సుమారు 60 లక్షల మంది ఓటర్ల వివరాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 32 లక్షల మంది ఓటర్ల వివరాలను 2002 నాటి బేస్‌ రోల్‌తో అనుసంధానం చేయలేకపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు.

లోపాలు ఉన్న, బేస్‌ రోల్‌తో మ్యాప్‌ కాని ఓటర్లకు ఆగస్టు 17 నుంచి 31వ తేదీ వరకు నోటీసులు జారీ చేయనున్నారు. ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా నేరుగా ఇళ్లకు నోటీసులు అందించడంతో పాటు రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా కూడా పంపనున్నారు.

SIR ప్రక్రియలో తమ పేరు డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో ఉందో లేదో ప్రతి ఓటరూ పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేరు తొలగించబడినా, వివరాల్లో లోపాలు ఉన్నా లేదా 2002 బేస్‌ రోల్‌తో తమ వివరాలు మ్యాప్‌ కాకపోయినా.. నోటీసు అందుకున్న తర్వాత సంబంధిత పత్రాలను సమర్పించి తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం ఉంటుంది. ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఓటరూ తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన సమయంలో స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు.