Maha Varuna Yagam - Vishvambhara News

వర్షాలు సమృద్ధిగా కురవాలని మహా వరుణ యాగం.. సీఎం దంపతుల ప్రత్యేక పూజలు
Telangana CM Revanth Reddy: తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాలని, కృష్ణా, గోదావరి నదుల్లో పుష్కలంగా నీటి ప్రవాహాలు కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగాన్ని నిర్వహించింది. కృష్ణా నది తీరంలోని నాగార్జునసాగర్ జలాశయం వద్ద సోమవారం నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా జల వనరులు సమృద్ధిగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు యాగంలో పాల్గొన్నారు. మిగిలిన వర్షాకాలంపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే అంచనాలు, ఎగువ ప్రాంతాల్లోని జలాశయాలు ఇంకా పూర్తిస్థాయిలో నిండకపోవడం నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండాలని, కృష్ణా, గోదావరి నదుల్లో ఆరోగ్యకరమైన నీటి ప్రవాహాలు కొనసాగాలని ప్రభుత్వం ఆకాంక్షించింది.