Cylinder Explosion - Vishvambhara News

మైదానగూడలో బెలూన్ సిలిండర్ పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు
Maidanaguda GSM Mall: హైదరాబాద్‌లోని మైదానగూడ వద్ద బెలూన్ సిలిండర్ పేలడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. జీఎస్‌ఎమ్ మాల్ సమీపంలో బెలూన్ల కోసం ఉపయోగించే సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి అక్కడ ఉన్నవారిలో ప్రకాష్ పాల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆయన కాలు తెగిపడినట్లు గుర్తించారు. దీంతో ఘటనాస్థలంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న ఇతరులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను రక్షించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఘటనకు కారణమైన వ్యక్తి ప్రమాదం జరిగిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి బాధ్యుడైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.