Sai Meghana - Vishvambhara News

తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. రెండోసారి తగ్గిన మార్కులతో మనస్తాపం
Tirupati NEET Student Sai Meghana: తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఎస్వీ నగర్‌కు చెందిన సాయి మేఘన నీట్ పరీక్షలో ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన మొదటి నీట్ పరీక్షలో సాయి మేఘనకు 499 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్షను మరోసారి నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో రెండోసారి నీట్ పరీక్ష నిర్వహించగా సాయి మేఘనకు 390 మార్కులు మాత్రమే వచ్చాయి. మొదటి పరీక్షతో పోలిస్తే మార్కులు గణనీయంగా తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో సుమారు పది రోజుల క్రితం సాయి మేఘన ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని దశదిన కర్మ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆమె కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాల కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సాయి మేఘన కుటుంబానికి న్యాయం చేయాలని, వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పోటీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షల నిర్వహణలో తలెత్తే పరిణామాలు విద్యార్థులపై తీవ్ర మానసిక ప్రభావం చూపకుండా వారికి కౌన్సెలింగ్, అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. సాయి మేఘన మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.