RSS - Vishvambhara News

మహిళలు రేప్‌ను ఇష్టపడతారు.. వివాదాస్పద వ్యాఖ్యలపై టీజీ మోహన్‌దాస్ అరెస్ట్
TG Mohandas Arrest: మహిళలు, ఢిల్లీ నిరసనకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళకు చెందిన రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్‌దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. మహిళా నిరసనకారులు రేప్‌ను ఇష్టపడతారంటూ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా తన చేతిలో అధికారం ఉండి ఉంటే జంతర్ మంతర్ పరిసరాల్లో కర్ఫ్యూ విధించి, నిరసనకారులు మాట వినకపోతే కాల్పులు జరపాలని ఆదేశించేవాడినని ఆయన వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా, ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. తిరువనంతపురం సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మట్టంచేరి సమీపంలోని కూవప్పాడమ్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు టీజీ మోహన్‌దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, టీజీ మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎలాంటి అధికారిక పదవి లేదని పేర్కొంటూ, ఆయన వ్యాఖ్యలను సంస్థ ఖండించింది. మరోవైపు తన వ్యాఖ్యలు వ్యంగ్యంగా, ఊహాత్మక సందర్భంలో చేసినవేనని మోహన్‌దాస్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే మహిళలపై, నిరసనకారులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.