Yadadri Bhuvanagiri - Vishvambhara News

కల్లు దొంగలకు చెక్.. తాటిచెట్టుకే సీసీ కెమెరా ఏర్పాటు చేసిన గీత కార్మికుడు
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఓ గీత కార్మికుడు కల్లు దొంగలకు చెక్ పెట్టేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తాను తాటిచెట్ల నుంచి గీస్తున్న కల్లును గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో తరచూ దొంగలించడంతో విసిగిపోయిన గీత కార్మికుడు అన్నెపు శ్రవణ్ గౌడ్ ఏకంగా తాటిచెట్టుకే సోలార్ సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతంలోనూ నిఘా కొనసాగేందుకు సోలార్ ఆధారిత కెమెరాను అమర్చడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

రాత్రి సమయంలో దొంగలు వచ్చి కల్లు ఎత్తుకెళ్తుండటంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని శ్రవణ్ గౌడ్ తెలిపారు. పలుమార్లు జాగారం చేసినా దొంగలను పట్టుకోలేకపోవడంతో చివరకు సాంకేతికతను ఆశ్రయించినట్లు చెప్పారు. ఇప్పుడు సీసీ కెమెరా ద్వారా చెట్టు వద్ద జరిగే ప్రతి కదలిక రికార్డు అవుతుండటంతో దొంగలు భయపడతారని వ్యక్తం చేశారు. ఈ వినూత్న చర్య ప్రస్తుతం మోత్కూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇతర గీత కార్మికులు కూడా తమ కల్లును కాపాడుకునేందుకు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.