Outer Ring Road - Vishvambhara News

ఓఆర్‌ఆర్ నిర్వహణలో నిర్లక్ష్యం సహించం.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
Revanth Reddy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్వహణలో నిర్లక్ష్యం ఏమాత్రం సహించబోమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ఓఆర్‌ఆర్ నిర్వహణ ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవని సీఎం పేర్కొన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, సక్రమ నిర్వహణ లేకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజూ వినియోగించే ఓఆర్‌ఆర్‌పై ఇలాంటి పరిస్థితులు కొనసాగడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు.

ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌పై వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని సీఎం గుర్తుచేశారు. రహదారిపై అక్రమంగా వాహనాలు నిలిపివేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారి నిర్వహణలో లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం జరిగితే సంబంధిత ప్రైవేట్ కాంట్రాక్టర్‌ను పూర్తిగా బాధ్యుడిగా పరిగణిస్తామని హెచ్చరించారు.

ఓఆర్‌ఆర్ నిర్వహణను హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు సురక్షితమైన, అత్యాధునిక ప్రమాణాలతో కూడిన ఔటర్ రింగ్ రోడ్‌ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, నిర్లక్ష్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.