National Handloom Day - Vishvambhara News

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు
Komatireddy Venkat Reddy: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతికి, సంప్రదాయ కళాసౌందర్యానికి చేనేత వస్త్రాలు ప్రతీకలని పేర్కొంటూ, మన చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చేనేత రంగాన్ని కాపాడటం, నేతన్నల సంక్షేమాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కష్టపడి అద్భుతమైన వస్త్రాలను నేసి దేశ సంస్కృతిని నిలబెడుతున్న నేత కార్మికుల శ్రమ అమూల్యమని మంత్రి కొనియాడారు.

చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. చేనేత రంగ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మంత్రి పిలుపునిచ్చారు. నేతన్నలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రజలంతా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలని కోరారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

నేతన్నల కష్టానికి వందనం.. చేనేత కార్మికులకు కేటీఆర్ శుభాకాంక్షలు
KTR NEWS: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నరాలను పోగులుగా, రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను అందమైన చీరలుగా మలిచి భారతీయ నాగరికతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నేతన్నల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం భారతీయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.

తెలంగాణ చేనేత కార్మికులు సమైక్య పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలు నేసే నైపుణ్యం ఉన్నప్పటికీ, ఉపాధి లేక అనేక మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో నేతన్నల జీవితాలను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరల పంపిణీ, రుణమాఫీ, పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పలువురు చేనేత కార్మికులు తిరిగి తెలంగాణకు వచ్చి తమ వృత్తిని కొనసాగించే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.

చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతన్నల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేసిందని, భవిష్యత్తులో కూడా చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్నల కష్టం, కళను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని రామచందర్ రావు పిలుపు
National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వారసత్వం చేనేత రంగమని పేర్కొన్న ఆయన, దేశ ఆర్థికాభివృద్ధిలో చేనేత కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చేనేత రంగం వెన్నెముకలా నిలుస్తోందని కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని రామచందర్ రావు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం వంటి లక్ష్యాలతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ చేనేతకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

'వోకల్ ఫర్ లోకల్' భావనను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. స్వదేశీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా లక్షలాది మంది చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పించిన వారమవుతామని అన్నారు. ప్రతి భారతీయుడు చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా మన సంప్రదాయాలను కాపాడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుస్తారని పేర్కొన్నారు.

చేనేత కార్మికుల కష్టం, నైపుణ్యం భారతదేశ గర్వకారణమని, వారి శ్రమకు సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందని రామచందర్ రావు అన్నారు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడం ద్వారా ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, చేనేత కళను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.