Traffic Challan - Vishvambhara News

యాక్టీవా ధర కంటే చలాన్లే ఎక్కువ.. చెక్ చేస్తే పోలీసులకే షాక్
Gurugram Traffic Police: హెల్మెట్ పెట్టుకోలేదు.. రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. ట్రాఫిక్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించాడు.. చివరకు చలాన్ల మొత్తం చూసి పోలీసులే షాక్ అయ్యారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రాజీవ్ చౌక్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఓ హోండా యాక్టీవాను ఆపి వాహన వివరాలు పరిశీలించగా, దానిపై ఏకంగా 96 పెండింగ్ చలాన్లు నమోదై ఉన్నట్లు గుర్తించారు. వాటి మొత్తం విలువ రూ.1 లక్షకు పైగా ఉండటంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

అధికారుల వివరాల ప్రకారం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (పీయూసీ) లేకపోవడం వంటి అనేక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ చలాన్లు పేరుకుపోయాయి. ఇన్ని ఉల్లంఘనలు చేసినప్పటికీ వాహన యజమాని ఒక్క చలానా కూడా చెల్లించకపోవడంతో మొత్తం భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు.

చివరకు ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటర్‌ను సీజ్ చేసి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన మరోసారి ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో స్పష్టం చేస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు.