Student - Vishvambhara News

ఏలూరు గురుకులంలో దారుణం.. విద్యార్థినిని బయటకు పంపిన ప్రిన్సిపాల్..
Gurukulam School Student: ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పుట్టినరోజు సందర్భంగా ఆమెను చూసేందుకు వచ్చిన తల్లి, కుటుంబ సభ్యులను పాఠశాల ప్రాంగణంలోకి అనుమతించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు రోజంతా పాఠశాల గేటు వద్దే వేచి ఉండగా, సాయంత్రం సమయంలో ప్రిన్సిపాల్ విద్యార్థినిని బయటకు పంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థిని తల్లి, బంధువులతో కలిసి ద్వారకాతిరుమల బస్టాండ్‌కు చేరుకుంది. స్వగ్రామమైన చింతలపూడికి వెళ్లేందుకు బస్సు లేక చిన్నారి బిక్కుబిక్కుమంటూ నిలిచిపోయింది. తన కుమార్తె పుట్టినరోజు కోసం తీసుకొచ్చిన కేక్, కొత్త బట్టలు చేతిలో పట్టుకుని కన్నీరు పెట్టుకున్న తల్లి దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి. తన కుమార్తె పుట్టినరోజు రోజున ప్రిన్సిపాల్ ఇలా వ్యవహరించడం బాధాకరమని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. బస్టాండ్‌లో ఉన్న స్థానికులు కూడా చిన్నారితో వ్యవహరించిన తీరును తప్పుబడుతూ సంబంధిత అధికారుల జోక్యాన్ని కోరారు.