AP Gen Z War - Vishvambhara News

డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగేదాకా తగ్గేదే లేదు: అనంత వెంకటరామిరెడ్డి
Ananta Venkatarami Reddy: డీఎస్సీ-2025 నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట "ఏపీ జన్ జెడ్ వార్" పేరుతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, డీఎస్సీ-2025 నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే రిలే నిరాహార దీక్షలను మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, వసీం, బోయ గిరిజమ్మ, వాసంతి సాహిత్యతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.