US Ambassador - Vishvambhara News

తెలంగాణలో పెట్టుబడులు పెంచండి.. అమెరికా రాయబారితో సీఎం రేవంత్ కీలక భేటీ న్యూస్ మేటర్:
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు అమెరికా వీసా ఇంటర్వ్యూ స్లాట్ల సంఖ్యను పెంచాలని, వీసాల కోసం ఎదురుచూపులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే ఐటీ నిపుణులకు హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, స్టాంపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి మరింత సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సమాచార సాంకేతికం, జీవ విజ్ఞాన శాస్త్రాలు, ఔషధ తయారీ, కృత్రిమ మేధస్సు, పరిశోధన రంగాల్లో భారీ పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని వివరించారు. అమెరికా సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, ఇరు దేశాల మధ్య సాంకేతిక, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని కోరారు.

విద్యా రంగంలో కూడా పరస్పర సహకారం పెరగాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు.

అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న భాషల్లో తెలుగు కూడా ఒకటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణతో విద్య, పెట్టుబడులు, సాంకేతికత, సంస్కృతి తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కోరగా, వ్యాపారం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని అమెరికా రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.