STPP - Vishvambhara News

నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైలు.. సింగరేణికి భట్టి విక్రమార్క అభినందనలు
Bhatti Vikramarka Singareni News: సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్‌టీపీపీ) కోసం కేటాయించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి రైల్వే రేక్ ద్వారా బొగ్గు తెలంగాణకు చేరుకోవడం సింగరేణి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం అని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సోదరులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయంతో సింగరేణి స్వయం సమృద్ధి దిశగా మరో కీలక అడుగు వేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. నాణ్యమైన బొగ్గు సరఫరా ద్వారా విద్యుత్ ఉత్పత్తి మరింత సమర్థవంతంగా సాగుతుందని, దీనివల్ల రాష్ట్ర ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. నైనీ కోల్ బ్లాక్ నుంచి బొగ్గు రవాణా ప్రారంభం కావడం సింగరేణి సంస్థ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణిని అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సింగరేణి మరింత అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని హామీ ఇచ్చారు.

ప్రపంచంలోని ప్రముఖ మైనింగ్ సంస్థలతో పోటీపడే స్థాయికి సింగరేణిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. ఉత్పాదకత, సాంకేతికత, పారదర్శకత, కార్మిక సంక్షేమం వంటి అన్ని రంగాల్లో సింగరేణిని ఆదర్శ సంస్థగా నిలపాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంస్థ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.