CV Anand - Vishvambhara News

అబ్బాయిలూ జాగ్రత్త.. అమ్మాయిలతో పిచ్చి వేషాలేస్తే క్షణాల్లో వచ్చి వాలుతాయి ఏఐ డ్రోన్లు
Telangana Police: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఏఐ ఆధారిత డయల్-112 అత్యవసర స్పందన సహాయ వ్యవస్థ (ఈఆర్‌ఎస్‌ఎస్)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని తెలంగాణ సమగ్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఈ నూతన వ్యవస్థను ప్రారంభించారు. ఇకపై ప్రమాదం, అగ్నిప్రమాదం, రోడ్డు ప్రమాదం, మహిళలపై వేధింపులు, బాలల రక్షణ, వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు.. ఇలా ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ప్రజలు వేర్వేరు హెల్ప్‌లైన్ నంబర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క 112కు కాల్ చేస్తే చాలు.. అవసరమైన శాఖలకు సమాచారం చేరి నిమిషాల్లోనే సహాయం అందేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

ఏఐతో క్షణాల్లో స్పందన..

డయల్-112కు వచ్చే ప్రతి కాల్‌ను కృత్రిమ మేధస్సు వెంటనే విశ్లేషిస్తుంది. కాల్‌లో మాట్లాడిన ప్రతి మాటను అక్షరరూపంలోకి మార్చడంతో పాటు సమస్యకు సంబంధించిన సంక్షిప్త నివేదికను సిద్ధం చేస్తుంది. అనంతరం అది పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక శాఖ లేదా ఇతర అత్యవసర విభాగాలకు సంబంధించినదో గుర్తించి, కాల్ చేసిన వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని జీపీఎస్, ఆధునిక మ్యాపింగ్ సాంకేతికత ద్వారా గుర్తిస్తుంది. దీంతో ఆపరేటర్లు సమీపంలోని సిబ్బందిని వెంటనే ఘటనాస్థలికి పంపే అవకాశం లభిస్తుంది. ఈ విధానం వల్ల స్పందన సమయం గణనీయంగా తగ్గి, ప్రాణాలను కాపాడే అవకాశాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

దేశంలో తొలిసారి ఏఐ డ్రోన్లు.. తెలంగాణకే ప్రత్యేకత

ఈ వ్యవస్థలో అత్యంత ప్రత్యేకమైన అంశం ఏఐ ఆధారిత డ్రోన్ల వినియోగం. అత్యవసర సేవల్లో డ్రోన్లను తొలి స్పందన బృందాలుగా వినియోగిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రోన్లు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యక్ష దృశ్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తాయి. అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, శాంతిభద్రతల సమస్యలు, భారీ జనసమూహాల నిర్వహణ, గల్లంతైన వ్యక్తుల అన్వేషణ వంటి సందర్భాల్లో ఈ డ్రోన్లు క్షణాల్లో సమాచారం అందించనున్నాయి.

నాలుగు కమిషనరేట్లలో పైలట్ అమలు

మొదటి దశలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో ఏఐ డ్రోన్లను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటే రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

అబ్బాయిలూ.. జర జాగ్రత్త..

ఈ కొత్త వ్యవస్థతో మహిళల భద్రతకు మరింత బలమైన రక్షణ లభించనుంది. సోషల్ మీడియాలో వేధింపులు, అసభ్యకర సందేశాలు, నకిలీ ఖాతాలతో వెంటపడటం, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం, రోడ్లపై ఈవ్‌టీజింగ్, స్టాకింగ్ వంటి ఘటనల్లో బాధితులు 112కు కాల్ చేస్తే చాలు. ఏఐ వెంటనే కాల్ వివరాలను నమోదు చేసి, బాధితురాలి ప్రాంతాన్ని గుర్తించి సమీపంలోని పోలీసు బృందాలకు సమాచారం అందిస్తుంది. దీంతో నిందితులపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

పోలీసులు హెచ్చరిక

సరదాగా చేశామనుకున్న పని.. జీవితాంతం కేసులు, కోర్టులు, జైలు వరకు తీసుకెళ్లే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మహిళలను వేధించడం, అసభ్యకర పోస్టులు పెట్టడం, ఫేక్ అకౌంట్లతో ఇబ్బందులు పెట్టడం, వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ప్రతి చర్యకు డిజిటల్ ఆధారాలు ఉంటాయని, ఏఐ సాంకేతికతతో నిందితులను గుర్తించడం మరింత సులభమవుతుందని స్పష్టం చేస్తున్నారు. అబ్బాయిలూ... జర జాగ్రత్త.. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించండి.. చట్టాన్ని గౌరవించండి.. లేకపోతే ఒక్క 112 కాల్‌తోనే పోలీసులు మీ ముందుంటారు.

రోజుకు 18 వేల అత్యవసర కాల్స్‌కు స్పందన

ప్రస్తుతం తెలంగాణ డయల్-112 కేంద్రం 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తోంది. ఇక్కడ 164 మంది శిక్షణ పొందిన సిబ్బంది, 900 కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 14 లక్షల కాల్స్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ వ్యవస్థకు చేరుతుండగా, వాటిలో దాదాపు 18 వేల అత్యవసర కాల్స్‌కు సిబ్బంది స్పందిస్తున్నారు. రోజుకు సగటున 7,500 ఘటనలను క్షేత్రస్థాయి బృందాలకు పంపించి తక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ కొత్త ఏఐ వ్యవస్థతో తెలంగాణలో అత్యవసర సేవలు మరింత వేగవంతంగా, కచ్చితంగా, ప్రజలకు మరింత చేరువ కానున్నాయని అధికారులు తెలిపారు.