Sonipat - Vishvambhara News

ఛీ వీళ్లు అసలు కూతుళ్లేనా?.. తండ్రి శవమై పడి ఉంటే రాకుండా.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
VC Sajjanar: కని పెంచిన ప్రేమా లేదు.. కడసారి చూపు చూసే బాధ్యత కూడా లేదు! సమాజంలో మనుషులు, మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో నిరూపించే ఒక దారుణ ఘటనపై తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. బతికున్నప్పుడు కన్నవారిని పట్టించుకోకపోవడం ఒకెత్తయితే.. చనిపోయాక కూడా అంత్యక్రియలను ఫోన్ స్క్రీన్ల మీద వీడియో కాల్లో చూసే స్థాయికి మనుషులు దిగజారిపోవడం సమాజంలో విలువలకి అద్దం పడుతోందని ఆయ‌న అన్నారు.

రెక్కలు ముక్కలు చేసుకుని పెంచితే.. చివరికి వృద్ధాశ్రమే మిగిలింది

హర్యానాలోని సోనిపట్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త జీవితం ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి, కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించి, వారిని సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఆ తండ్రికి చివరికి కంటిపాపలా చూసుకోవాల్సిన పిల్లలు దూరమయ్యారు. జీవితమంతా ఒంటరితనంతో నరకం అనుభవిస్తూ ఆయన ఒక వృద్ధాశ్రమంలోనే కన్నుమూశారు.

వీడియో కాల్‌తో అంత్యక్రియలా

తండ్రి చనిపోయాడని తెలిసినా ఆ కుమార్తెలు కనీసం కడసారి చూపు కోసం కూడా రాలేకపోయారు. అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా ఉచితంగా చూస్తూ, దహన సంస్కారాల ఖర్చులకు కొద్దిపాటి డబ్బులు పంపి తమ బాధ్యత తీరిపోయిందని అనుకున్నారు. ఈ ఘటనపై సజ్జనార్ స్పందిస్తూ.. ఎంత సాంకేతికత పెరిగితే ఏం లాభం కన్నవారి పట్ల ప్రేమ, కృతజ్ఞత లేనప్పుడు మనిషి ఎంత ఎదిగినా శూన్యమే. కొంత డబ్బు విసిరేస్తే బాధ్యత తీరిపోదు. మనుషుల ఆలోచనలు, బంధాల విలువలు ఇంతలా దిగజారిపోవడం నిజంగా సమాజానికి సిగ్గుచేటని అన్నారు.

చనిపోయాక ఏడ్చి ఉపయోగం లేదు.. ఉన్నప్పుడే ప్రేమించండి

మన కోసం తమ జీవితాలనే ధారపోసిన తల్లిదండ్రులను చివరి రోజుల్లో వృద్ధాశ్రమాల్లో పడేసి, దూరంగా ఉండటం మానవత్వానికే పెద్ద మచ్చ అని ఆయన ఆవేదన చెందారు. ఆస్తులు, హోదాలు కావు.. బతికున్నప్పుడే ఆత్మీయంగా పలకరించి, వారి చివరి క్షణాల్లో అండగా నిలవడమే అసలైన సంతాన ధర్మమని సజ్జనార్ గుర్తుచేశారు. ఈ ఘటనను చూసైనా నేటి సమాజం కళ్లు తెరిచి, తమ కన్నవారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని పిలుపునిచ్చారు.