national - Vishvambhara News

సాగర తీరాన నౌకాదళ పరాక్రమం
విశ్వంభర, ఏపీ బ్యూరో: భారత నౌకాదళ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం విశాఖపట్నం తీరంలో ఆవిష్కృతమైంది. భారత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026)' భారత నావికాదళ పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఐఎన్ఎస్ సుమేధను 'ప్రెసిడెన్షియల్ యాట్'గా మలిచి, అందులో రాష్ట్రపతి ప్రయాణిస్తూ తీరంలో లంగరు వేసిన యుద్ధనౌకలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 45 భారతీయ నౌకలతో పాటు, 19 విదేశీ యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ నౌకలు పాల్గొని సాగర తీరాన్ని రక్షణ కవచంలా మార్చేశాయి. సముద్ర అలలపై నౌకలు, జలాంతర్గాములు చేసిన కవాతు, ఆకాశంలో నౌకాదళ విమానాలు చేసిన ఫ్లైపాస్ట్ వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

సాహస విన్యాసాలతో హోరెత్తిన సాగరం
ఈ సమీక్షలో భాగంగా భారత నేవీ అత్యున్నత శిక్షణకు నిదర్శనంగా నిలిచే పలు ప్రదర్శనలు జరిగాయి. మార్కోస్ కమాండోలు అత్యంత వేగంగా నిర్వహించిన పోరాట విన్యాసాలు, హెలికాప్టర్ల ద్వారా చేపట్టిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు ఉత్కంఠను రేకెత్తించాయి. 'యునైటెడ్ త్రూ ఓషన్స్' (సముద్రాల ద్వారా ఏకత్వం) అనే నినాదంతో సాగిన ఈ ఉత్సవం, అంతర్జాతీయ జలాల్లో శాంతిని, సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సాగింది. సముద్రం ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నామనే సందేశాన్ని ఇస్తూ, వివిధ దేశాల జెండాలతో యుద్ధనౌకలు బారులు తీరిన దృశ్యం ప్రపంచ దేశాల మధ్య ఉన్న మైత్రికి చిహ్నంగా నిలిచింది. ఈ చారిత్రక ఘట్టానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సాక్ష్యంగా నిలిచారు.

'మహాసాగర్' విజన్.. ప్రపంచానికే మార్గదర్శి
సమీక్ష అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. భారతదేశం ఎప్పుడూ 'వసుధైవ కుటుంబకం' స్ఫూర్తిని నమ్ముతుందని, సముద్ర భద్రతలో ప్రపంచ దేశాలన్నీ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమైన 'మహాసాగర్' విజన్‌ను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది కేవలం రక్షణకే పరిమితం కాకుండా, అందరి అభివృద్ధి, భద్రతను కోరుకుంటుందని స్పష్టం చేశారు. విపత్తు సమయాల్లో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. మిత్ర దేశాల నౌకాదళాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పరస్పర విశ్వాసానికి నిదర్శనమని రాష్ట్రపతి పేర్కొన్నారు.

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ స్థానాలకు ఫిబ్రవరి 26న అధికారికంగా నోటిఫికేషన్ జారీ కానుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

తెలంగాణలో ఉత్కంఠ.. రేసులో కీలక నేతలు
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుంది. వీరిలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కేఆర్ సురేష్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన సింఘ్వి పదవీకాలం కూడా ఇప్పుడు ముగియనుంది. ఈ రెండు స్థానాలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి ఈ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తుండగా, ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ముగియనున్న ప్రముఖుల పదవీకాలం
కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా మహారాష్ట్ర (7), తమిళనాడు (6), బీహార్ (5), పశ్చిమ బెంగాల్ (5) వంటి రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. శరద్ పవార్, రామ్ దాస్ అథవాలే, ప్రియాంక చతుర్వేది వంటి హేమాహేమీల పదవీకాలం కూడా ఈ ఏప్రిల్‌తోనే ముగియనుండటంతో ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రంలో ఉన్న ఎన్డీయే కూటమి తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తుండగా, 'ఇండియా' కూటమి సభ్యులు గరిష్ట స్థానాలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. మార్చి 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టి
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  తాజాగా విడుదల చేసిన 2024–25 ఆర్థిక సంవత్సర నివేదిక ప్రకారం.. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా అందిన విరాళాల్లో సింహభాగం బీజేపీకే దక్కాయి. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి ఎలక్టోరల్ ట్రస్ట్‌లకు రూ.3,826 కోట్ల విరాళాలు అందాయి. ఈ మొత్తం నిధుల్లో, బీజేపీకి రూ.3,157 కోట్లు (సుమారు 82.5%) దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం రూ.298.78 కోట్లు (7.8%) మాత్రమే దక్కాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.102 కోట్లు అందాయి.

ప్రధాన దాతలు - కార్పొరేట్ దిగ్గజాల వాటా
రాజకీయ విరాళాల్లో కార్పొరేట్ సంస్థల వాటా అత్యధికంగా ఉంది. ఎలివేటెడ్ అవెన్యూ రియల్టీ రూ.500 కోట్లు అందజేసి అగ్రస్థానంలో నిలిచింది. టాటా గ్రూప్ (టాటా సన్స్ & TCS) సుమారు రూ.525 కోట్ల నిధులను సమకూర్చింది. మేఘా ఇంజనీరింగ్ తెలుగు రాష్ట్రాల నుండి రూ.175 కోట్లను విరాళంగా ఇచ్చి ప్రముఖ దాతల జాబితాలో నిలిచింది. ఈ భారీ నిధుల సమీకరణ బీజేపీకి పార్టీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు, ఎన్నికల వ్యయానికి భారీ ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిధుల సమీకరణలో కనిపిస్తున్న ఈ భారీ వ్యత్యాసం, భవిష్యత్తులో ఎన్నికల ప్రచారాలు, పోటీ తత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకం చుట్టూ రాజకీయ దుమారం.. కేంద్రం సంచలన నిర్ణయం?
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత సైన్యానికి నాయకత్వం వహించిన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన ఆత్మకథ 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా అధికారికంగా విడుదల కాకముందే ఈ పుస్తకంలోని అంశాలు బయటకు రావడం, దానిపై పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా గల్వాన్ ఘర్షణలు, అగ్నివీర్ పథకం వంటి సున్నితమైన అంశాల గురించి ఇందులో ప్రస్తావించినట్లు సమాచారం.

20 ఏళ్ల 'కూలింగ్ ఆఫ్ పీరియడ్' నిబంధన?
ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మిలిటరీ సహా ఇతర కీలక ఉన్నత పదవుల్లో పనిచేసి రిటైర్ అయిన అధికారులు, వారు బాధ్యతల నుంచి తప్పుకున్న 20 ఏళ్ల వరకు పుస్తకాలు ప్రచురించకూడదనే 'కూలింగ్ ఆఫ్ పీరియడ్'ను తప్పనిసరి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై అనధికారికంగా చర్చ జరిగినట్లు సమాచారం. దేశ భద్రత, రహస్య సమాచార రక్షణ దృష్ట్యా ఈ నిబంధన అవసరమని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, కీలక అధికారులు రాసే పుస్తకాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. నరవణే పుస్తకానికి రక్షణ శాఖ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ లోపే పుస్తక ప్రతులు బయటకు రావడంపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎప్ స్టిన్ ఫైల్స్ వివాదంపై ప్రభుత్వం స్పందన
ఇదే సమావేశంలో ఇటీవల అమెరికాలో బయటపడిన జెఫ్రీ ఎప్ స్టిన్ ఫైల్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఈ ఫైల్స్‌లో ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను మంత్రి ఇప్పటికే ఖండించారు. ప్రతిపక్షాల విమర్శలపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా కొనసాగించాలని మంత్రులు ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నాలుగులేన్ల జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: తెలంగాణ రవాణా రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణలోని గుడేబెల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర రహదారిని 4-లేన్ల ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. రాయచూర్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్ మీదుగా సాగే ఈ రహదారి వల్ల హైదరాబాద్‌కు కనెక్టివిటీ మెరుగుపడటమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ కేంద్రాలకు రవాణా సులభతరం కానుంది.

దేశవ్యాప్తంగా మూడు కీలక రైల్వే ప్రాజెక్టులు
రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే దిశగా ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 12 జిల్లాలను కవర్ చేస్తూ సుమారు రూ.18,509 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 2030-31 నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులలో కాసారా - మన్మాడ్ 3వ, 4వ లైన్, ఢిల్లీ - అంబాలా 3వ, 4వ లైన్, బల్లారి - హోసాపేట 3వ, 4వ లైన్ ఉన్నాయి. ఈ నిర్మాణాల ద్వారా సుమారు 265 లక్షల మానవ-రోజుల ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పీఎం-గతి శక్తి మాస్టర్ ప్లాన్ ఆధారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టుల వల్ల రవాణా ఖర్చులు తగ్గి, చమురు దిగుమతులు తగ్గి, కార్బన్ ఉద్గారాల నియంత్రణకు దోహదపడుతుంది.

అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద టన్నెల్
ఈ సమావేశంలో అస్సాం అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ, NH-15లోని గోహ్‌పూర్ నుండి నుమాలిఘర్ వరకు నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీకి ఆమోదం లభించింది. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద 15.79 కిలోమీటర్ల పొడవైన రోడ్-కమ్-రైల్ టన్నెల్‌ను రూ. 18,662 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అలాగే, మహారాష్ట్రలో రూ. 3,320 కోట్ల వ్యయంతో NH-160A లోని ఘోటి - త్రింబక్ - జవహర్ - మనోర్ - పాల్ఘర్ సెక్షన్‌ను రెండు/నాలుగు లేన్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది.

'సేవా తీర్థ్' నుంచి మోదీ కీలక నిర్ణయాలు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారతదేశ పరిపాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనం 'సేవాతీర్థ్'ను ప్రారంభించారు. అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ నూతన కార్యాలయ సముదాయంలోకి ప్రవేశించిన వెంటనే, ప్రధాని మోదీ ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పలు కీలక పథకాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయానికి సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 'వికసిత్ భారత్' సాధన లక్ష్యంతోనే మనం పనిచేస్తున్నామని, ఈ నూతన భవనం 'కర్తవ్య భవన్' గా పరిపాలనకు దిక్సూచిగా మారుతుందని అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా, కొందరు ఇప్పటికీ మానసిక బానిసత్వ ఛాయలను విడిచిపెట్టలేదని విమర్శించారు. మనం నిర్మించుకున్న ఈ నూతన సముదాయం, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, కేబినెట్ సెక్రటేరియట్‌లతో కలిసి దేశ పరిపాలనకు మరింత వేగాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పీఎం-రాహత్ పథకం ప్రారంభం
రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు, వారికి సకాలంలో వైద్య సహాయం అందించే లక్ష్యంతో ప్రధాని మోడీ 'పీఎం-రాహత్' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి తక్షణమే నగదు రహిత చికిత్స అందించనున్నారు. ప్రతి ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్యం అందించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. అలాగే మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, 'లక్‍పత్ దీదీ' పథకం లక్ష్యాన్ని భారీగా పెంచారు. ఇప్పటి వరకు ఉన్న 3 కోట్ల మంది మహిళల టార్గెట్‌ను, 2029 నాటికి 6 కోట్ల మందికి విస్తరించేలా ప్రధాని నిర్ణయం తీసుకున్నారు.

వ్యవసాయ నిధి రూ.2లక్షల కోట్లకు పెంపు
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రస్తుతమున్న రూ.1 లక్షల కోట్లకు బదులుగా రూ.2 లక్షల కోట్లకు రెట్టింపు చేస్తూ ప్రధాని ఫైలుపై సంతకం చేశారు. దేశంలో స్టార్టప్ వ్యవస్థను వేగవంతం చేసేందుకు, యువతలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

114 యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని, వాయుసేన బలాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిన అత్యంత ఆధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3.60 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌తో చేపట్టనున్న ఈ అతిపెద్ద రక్షణ ఒప్పందానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఒప్పందం ప్రత్యేకతలు
మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాలను భారత వాయుసేన కోసం కొనుగోలు చేయనున్నారు. ఈ 114 విమానాలలో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు ఉండనున్నాయి. రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్‌ ఈ విమానాలను సరఫరా చేయనుంది.

మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత
ఈ కొనుగోలు ఒప్పందంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి పెద్దపీట వేశారు. విమానాల తయారీ, అసెంబ్లీ వంటి ప్రక్రియల కోసం డసో ఏవియేషన్‌ భారత్‌లోని ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. దీని ద్వారా సాంకేతికత బదిలీ జరగడమే కాకుండా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే భారత వాయుసేన వద్ద 36 రఫేల్ యుద్ధ విమానాలు విధులు నిర్వహిస్తున్నాయి.

ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన -అధికారిక ఒప్పందం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ కీలక పర్యటనకు ముందు రక్షణ శాఖ నుండి ఈ ఒప్పందానికి ఆమోదం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య ఈ కొనుగోళ్ల కోసం అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

మణిపుర్ సీఎంగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: సుదీర్ఘ కాలం తర్వాత మణిపుర్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పునరుద్ధరణ అయింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ బుధవారం ఉదయం కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాలనా పగ్గాలు మళ్ళీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వచ్చాయి.

2023 మే నెల నుంచి మణిపుర్ రాష్ట్రం జాతుల మధ్య చెలరేగిన హింసతో అట్టుడికింది. శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ తప్పుకున్న సమయం నుంచి నేటి వరకు రాష్ట్రం కేంద్రం నిఘాలో, రాష్ట్రపతి పాలన కింద కొనసాగింది. నలభై స్థానాలకు పైగా బలం ఉన్న కూటమికి నాయకత్వం వహిస్తున్న ఖేమ్‌చంద్‌ సింగ్‌, రాష్ట్రంలో శాంతి స్థాపనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.

మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న భారీ ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామం అటు అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువులకు ఊపిరి పోయడంతో పాటు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ట్రంప్ 'ట్రూత్' సోషల్ వేదికగా సంచలన ప్రకటన
ప్రధాని మోదీతో సంభాషణ అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. "నా స్నేహితుడు మోదీ ఒక శక్తిమంతమైన నాయకుడు. ఆయన విజ్ఞప్తిని గౌరవిస్తూ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసి, అమెరికా, వెనిజులా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది" అని ట్రంప్ పేర్కొన్నారు.

సుంకాల లెక్కలివే
ఇప్పటివరకు భారతీయ ఉత్పత్తులపై అమెరికా దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తోంది. ఇందులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షాత్మకంగా విధించిన 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. తాజా ఒప్పందంతో మొత్తం సుంకం 18 శాతానికి తగ్గించింది. అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు సున్నా స్థాయికి చేర్చింది. దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ, వ్యవసాయం, ఇంధన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోనుంది.

ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై మోదీ స్పందిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. "రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచ శాంతికి, సుస్థిరతకు మార్గం సుగమమవుతుంది. అమెరికా సుంకాల తగ్గింపు ఎంతో సంతోషకరం. ట్రంప్ నాయకత్వంలో మా భాగస్వామ్యం అత్యున్నత స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను" అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

జైశంకర్ పర్యటన వేళ కీలక మలుపు
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటన ప్రారంభమైన రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు, ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగాలకు భారీ ఊరట కలగనుంది. 'మోదీ-ట్రంప్' ద్వయం ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎయిరిండియా విమానంలో ఇంధన స్విచ్ లోపం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బయల్దేరి సోమవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ విమానంలోని 'ఇంధన నియంత్రణ స్విచ్'లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. దీనిపై పైలట్ ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా యాజమాన్యం తక్షణమే స్పందించి ఆ విమానాన్ని సర్వీసుల నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణిస్తూ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ  దృష్టికి తీసుకెళ్లారు. సాంకేతిక లోపం తలెత్తిన ఏఐ132 (AI132) సర్వీసు విమానాన్ని ప్రస్తుతం విమాన తయారీ సంస్థకు చెందిన నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డీజీసీఏ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా ఎయిరిండియా వద్ద ఉన్న అన్ని బోయింగ్ 787 విమానాల ఇంధన స్విచ్‌లను తనిఖీ చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, మిగిలిన విమానాల్లో ఎటువంటి లోపాలు లేవని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విమాన తయారీదారుల సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి ఇంధన సరఫరా నిలిచిపోవడమే ప్రధాన కారణమని 'విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో' తన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. కేవలం సెకను వ్యవధిలో రెండు ఇంజిన్లకు ఇంధనం అందకపోవడం వల్లే ఆ దుర్ఘటన జరిగిందని ఏఏఐబీ తేల్చింది.

సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బెంగాల్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మమతా బెనర్జీ, అనంతరం వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎందరో అధికారులను చూశానని, కానీ ఇంతటి అహంకారిని, అబద్ధాల కోరును తన జీవితంలో చూడలేదని మండిపడ్డారు.

బెంగాల్‌పై వివక్ష ఎందుకు?
సమీక్షా సమావేశంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ.. "నేను ఢిల్లీ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్నాను. నాలుగు సార్లు కేంద్ర మంత్రిగా, ఏడు సార్లు ఎంపీగా పనిచేశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను.. మీ కుర్చీకి నేను గౌరవం ఇస్తాను కానీ, ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ప్రవర్తన సరిగా లేదు. ఎవరో ఒకరోజు ఆ కుర్చీని వదిలిపెట్టాల్సిందేనని వారికి ముఖం మీదే చెప్పాను" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కాకుండా కేవలం బెంగాల్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో పండుగలా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను పక్షపాతపూరితంగా మారుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 58 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని, ఇది తీవ్రమైన వివక్ష అని మమతా ఆరోపించారు. ఓటర్ల తొలగింపుపై కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వలేదని, ఇది పక్షపాతపూరిత చర్య అని మండిపడ్డారు. ఒక వర్గాన్ని లేదా ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతరిక్ష వీరుడికి ‘అశోక చక్ర’
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత గగనతల యోధుడు, అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశం అత్యున్నత సైనిక పురస్కారం ‘అశోక చక్ర’తో గౌరవించనుంది. శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గతేడాది చేపట్టిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన అంతరిక్షంలో అద్భుతమైన పరిశోధనలు చేశారు. శూన్య గురుత్వాకర్షణ స్థితిలో మానవ కండరాలకు జరిగే నష్టంపై కీలక ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్షంలో మానవ జీర్ణ వ్యవస్థ తీరుతెన్నులపై ప్రత్యేక వీడియోను చిత్రీకరించడంతో పాటు, వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై లోతైన అధ్యయనం చేశారు. అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలండ్, హంగేరీ వ్యోమగాములతో కలిసి ఆయన ఈ మిషన్‌లో పాలుపంచుకున్నారు.

అశోక చక్ర విశిష్టత
సాధారణంగా యుద్ధ క్షేత్రంలో ప్రదర్శించే సాహసానికి 'పరమ వీర చక్ర' ఇస్తే.. యుద్ధం లేని సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు, అంకితభావం కనబరిచిన వారికి 'అశోక చక్ర' ప్రదానం చేస్తారు. అంతరిక్షం లాంటి అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన మిషన్‌లో పాల్గొని, భారతదేశం తరపున సరికొత్త రికార్డులు నెలకొల్పినందుకు గాను శుక్లాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సమాచారం.