PV Sindhu - Vishvambhara News

గ్లోబల్ ఐటీ హబ్‌గా విశాఖ.. రేపు మంత్రి నారా లోకేష్ కీలక పర్యటన
Nara Lokesh News: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు (బుధ‌వారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ అభివృద్ధికి ఐటీ, క్రీడా రంగాలు రెండూ కీలకమని భావిస్తున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన

పర్యటనలో భాగంగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధుతో కలిసి మంత్రి లోకేష్ తోటగరువు వద్ద ఏర్పాటు చేయనున్న "పీవీ సింధు సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్" కు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, గ్రామీణ ప్రతిభను వెలికితీసి కామన్వెల్త్, ఒలింపిక్స్ స్థాయి విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా ఈ అత్యాధునిక సెంటర్‌ను రూపుదిద్దుతున్నారు.

ఐబీఎం ఇన్నోవేటివ్ క్లయింట్ సెంటర్ పరిశీలన

క్రీడా అకాడమీ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, మంత్రి నారా లోకేష్, పీవీ సింధులతో కలసి ఇసుకతోటలోని ల్యాన్సమ్ స్క్వేర్‌లో నూతనంగా రూపుదిద్దుకున్న "ఐబీఎం ఇన్నోవేటివ్ క్లయింట్ సెంటర్" ను సందర్శించనున్నారు. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అక్కడ అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సేవలు, కృత్రిమ మేధ (AI) సంబంధిత పరిశోధనలు, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రతినిధులతో చర్చించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం

మంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం, విద్యా, క్రీడాశాఖల అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేశారు. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ పర్యటన ద్వారా సాగర తీర నగరం విశాఖపట్నంలో ఐటీ పెట్టుబడులకు, అంతర్జాతీయ క్రీడా శిక్షణకు కొత్త ఊపిరి అందనుందని జిల్లా వాసులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.