Harassment Case - Vishvambhara News

ఎస్ఐ ఎదుటే అవమానించారు.. న్యాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి
Danthalapally News: న్యాయం కోసం బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే, అక్కడ కూడా వారికి కోలుకోలేని అవమానం ఎదురైన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది. నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారు విధులు నిర్వహిస్తున్న సమయంలో బాత్రూమ్‌లకు వెళ్లే దృశ్యాలు, ఇతర వ్యక్తిగత వీడియోలను రహస్యంగా చిత్రీకరిస్తూ తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆకృత్యాలు తాళలేక, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆగస్టు 1న బాధితులు ధైర్యం చేసి దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అయితే న్యాయం చేకూరుతుందని భావించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళలకు అక్కడ రక్షణకు బదులు తీవ్ర అవమానమే ఎదురైంది. బాధితుల కథనం ప్రకారం, ఎస్ఐ రవికుమార్ తమను న్యాయం చేస్తామని నమ్మించి స్టేషన్‌కు పిలిపించి, తాము ఫిర్యాదు చేసిన నిందితుడు నరేష్ ముందే తమను దారుణంగా దూషిస్తూ తీవ్రంగా అవమానించారు. బాధితుల పక్షాన నిలవాల్సిన అధికారే, నిందితుడి సమక్షంలో తమను హేళన చేస్తూ మాట్లాడటంతో న్యాయం కోసం వెళ్లిన తమకు తీవ్ర మనోవేదన మిగిలిందని, వ్యవస్థపై నమ్మకం పోతోందని మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితుడికి కొమ్ముకాస్తూ తమను అవమానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు, ఈ వ్యవహారంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి వేధింపులకు గురిచేసిన నరేష్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితులని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్‌లో తమను అవమానించిన ఎస్ఐ రవికుమార్‌పై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ దారుణ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.