Kanaka Durga Temple - Vishvambhara News

విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ వారం రోజుల పాటు మూసివేత
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘాట్‌రోడ్‌లో మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 22 ఉదయం నుంచి వారం రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఘాట్‌రోడ్‌ మూసివేత సమయంలో భక్తులు శ్రీ కనకదుర్గానగర్ మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి విజయవాడకు వచ్చే భక్తుల వాహనాలను పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్‌కు అనుమతించనున్నారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

విశాఖపట్నం, చెన్నై వైపు నుంచి వచ్చే భక్తుల కోసం సీతమ్మ వారి పాదాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి ఆలయం వరకు భక్తులను తరలించేందుకు ఉచిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

దసరా ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు తమ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపి, అక్కడి నుంచి ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ సూచించారు.

ఘాట్‌రోడ్ మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు భక్తులు పోలీసు, ఆలయ అధికారుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు. దసరా ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాకపోకలు సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. అమ్మవారి అలంకారాల షెడ్యూల్ ఇదే
Indrakeeladri Dasara: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించనున్నారు. ఈ పది రోజుల పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో సందడిగా మారనుంది.

అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీ దేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 14న మహాచండీ దేవి, 15న లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 16న మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. దీంతో మూలానక్షత్రం రోజున ప్రత్యేక పూజలు, దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

అక్టోబర్ 17న మహాలక్ష్మీ దేవిగా, 18న దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 19న మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్ధిని దేవి అలంకారంలో, అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు కొలువుదీరనున్నారు. దసరా మహోత్సవాల షెడ్యూల్ విడుదల కావడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టనున్నారు.

దసరా అలంకారాల షెడ్యూల్:

అక్టోబర్ 11 – బాలా త్రిపురసుందరీ దేవి
అక్టోబర్ 12 – గాయత్రీ దేవి
అక్టోబర్ 13 – అన్నపూర్ణాదేవి
అక్టోబర్ 14 – మహాచండీ దేవి
అక్టోబర్ 15 – లలితా త్రిపుర సుందరీ దేవి
అక్టోబర్ 16 – సరస్వతీ దేవి (మూలానక్షత్రం)
అక్టోబర్ 17 – మహాలక్ష్మీ దేవి
అక్టోబర్ 18 – దుర్గాదేవి (దుర్గాష్టమి)
అక్టోబర్ 19 – మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి)
అక్టోబర్ 20 – రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఎదుట యువతి రీల్స్.. వైరల్ వీడియో
Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం గాలిగోపురం ఎదుట ఓ యువతి రీల్స్ చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో యువతి వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది. ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రీల్స్, వీడియో షూటింగ్ చేయడం క‌రెక్టేనా అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి చర్యలు నివారించాలని సూచిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందిస్తారా? ఆలయ ప్రాంగణంలో వీడియో చిత్రీకరణకు సంబంధించి ఉన్న నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తారా? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ఈ ఘటనపై ఆలయ అధికారులు లేదా పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.