Dragon Shooting Update - Vishvambhara News

డ్రాగన్ ఆగిపోయిందనే వార్తలకు చెక్.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ టీమ్
Jr NTR Dragon Movie: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'డ్రాగన్' షూటింగ్ నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలకు చిత్రబృందం సన్నిహిత వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపినా, సినిమా చిత్రీకరణ నిలిపివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు.

అయితే ఎన్టీఆర్ గాయంతో సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయిందని, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సృజనాత్మక విభేదాలు తలెత్తడంతో చిత్రీకరణకు బ్రేక్ పడిందని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా కథనాల్లో ప్రచారం జరిగింది. కానీ చిత్రానికి సంబంధించిన వర్గాలు ఈ ప్రచారాన్ని ఖండించాయి. సినిమా ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతోందని వెల్లడించాయి.

ఎన్టీఆర్ విశ్రాంతిలో ఉన్న సమయంలో ఆయన అవసరం లేని సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇతర నటీనటులతో కూడిన సన్నివేశాలు ప్రస్తుతం తెరకెక్కుతున్నాయని, ఈ వ్యవధిలో వాటిని పూర్తి చేసేలా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదని చిత్రబృందం చెబుతోంది.

అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య కథకు సంబంధించిన చర్చలు షూటింగ్ ప్రారంభానికి ముందే పూర్తయ్యాయని, అన్ని అంశాలపై పరస్పర అవగాహనతోనే చిత్రీకరణ మొదలైందని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇటీవల విడుదల చేసిన సుమారు నాలుగు నిమిషాల గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రావడంతో చిత్రబృందం మరింత ఉత్సాహంగా ఉందని సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుండగా, 2027 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.