Matangi Swarnalatha - Vishvambhara News

ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే ప్రాణనష్టం: మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు
Secunderabad Bonalu: సికింద్రాబాద్ బోనాల వేడుకల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో మాతంగి స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి ప్రస్తుతం భక్తుల్లో, అంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో అహంకారం రోజురోజుకూ పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ అహాన్ని పక్కనపెట్టి ధర్మమార్గంలో నడవాలని సూచించారు. ఈ ఏడాది ప్రజల తీరు తనను ఎన్నో విధాలుగా బాధపెడుతోందని, కంటతడి పెట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, భక్తులు పరిపూర్ణ విశ్వాసంతో వస్తే వారి వెంటే ఉండి ఆశీర్వదిస్తానని అభయమిచ్చారు.

మాతంగి స్వర్ణలత చేసిన విగ్రహ ప్రతిష్ఠాపన హెచ్చరిక భక్తులలో తీవ్ర ఆందోళనను, ఆసక్తిని రేకెత్తించింది. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరేలా దీవిస్తానని తెలుపుతూనే, ఆరు నెలల వ్యవధిలోగా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తి చేయకపోతే తీవ్ర ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న భక్తులందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

వర్షాలు, ప్రకృతి విపత్తులపై స్పందిస్తూ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాపాతం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, ముంచెత్తే వరదలతో పాటు ఊహించని అగ్నిప్రమాదాలు కూడా సంభవించే ప్రమాదం ఉందన్నారు. వరదల ధాటికి ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితులు తలెత్తుతాయని, ప్రకృతి కోపానికి గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

సమాజంలో రోజురోజుకూ క్షీణిస్తున్న మానవ సంబంధాల పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి, నైతిక విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయని, వావివరుసలు కూడా మరచి ఘోరాలకు పాల్పడుతున్న వారిని తాను ఎంతమాత్రం వదిలిపెట్టనని, వారికి కఠిన శాస్తి తప్పదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ఈ భవిష్యవాణి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.