Patta Gangavaram Beach - Vishvambhara News

ఫ్రెండ్స్ డే రోజున విషాదం.. విశాఖ బీచ్‌లో ఇద్దరు యువకుల మృతి
Patta Gangavaram Beach: విశాఖపట్నంలో ఫ్రెండ్స్ డే రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. పెదగంట్యాడ మండలం పట్ట గంగవరం బీచ్‌లో సముద్రంలో మునిగి ఓ యువతి, యువకుడు మృతి చెందారు. మృతులను జాలారిపేటకు చెందిన నీతు (18), పెందుర్తికి చెందిన దామోదర్గా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో నలుగురు యువతులు, ముగ్గురు యువకులు కలిసి ఫ్రెండ్స్ డే సందర్భంగా పట్ట గంగవరం బీచ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఫొటోలు దిగుతుండగా నీతు ప్రమాదవశాత్తూ సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు దామోదర్ వెంటనే సముద్రంలోకి దూకగా, అలల ఉద్ధృతికి ఇద్దరూ గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, మత్స్యకారులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే దామోదర్‌కు కనకమహాలక్ష్మి అనే యువతితో నిశ్చితార్థం జరిగినట్లు తెలిసి స్థానికులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీతు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కావడం ఈ విషాదాన్ని మరింత కలచివేసింది.

ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సముద్ర తీరాలకు వెళ్లే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, హెచ్చరికలు ఉన్న ప్రాంతాల్లో నీటిలోకి వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు.