Samastipur Saharsa Passenger - Vishvambhara News

ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికుల్లో భయాందోళన
Fire Accident: బీహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లా సిమ్రీ బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో  అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్–సహర్సా ప్యాసింజర్ రైలు (నం. 63344) స్టేషన్‌లో ఉండగా ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఒక బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బోగీ నుంచి భారీగా పొగ, మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వెంటనే బోగీల నుంచి బయటకు పరుగులు తీయగా, రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో కొద్దిసేపు శ్రమించిన అనంతరం మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అగ్నిప్రమాదం ఇతర బోగీలకు వ్యాపించకుండా సకాలంలో నియంత్రించడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం లేదని, అయితే మంటలు చెలరేగిన బోగీకి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు, రైల్వే రక్షణ దళం (RPF) దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. సాంకేతిక తనిఖీలు పూర్తయిన తర్వాత రైలు సేవలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.