Hyderabad Crime - Vishvambhara News

ఇంట్లోకి చొరబడి కత్తితో వార్నింగ్.. రౌడీషీటర్ ఆటకట్టించిన అత్తాపూర్ పోలీసులు
Attapur Police: హైదరాబాద్ అత్తాపూర్‌లో కత్తితో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో రౌడీషీటర్ సయ్యద్ మహ్మద్ అలియాస్ చాంగో (25)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన 12 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అత్తాపూర్ పోలీసులు తెలిపారు. చాంగో సెంటరింగ్ కార్మికుడిగా, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 4న చాంగో నూర్‌జహాన్ బేగం ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆమె కుమారుడు అబ్దుల్ రెహ్మాన్ గొంతుకు కత్తి పెట్టి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నూర్‌జహాన్‌ను కూడా కత్తితో బెదిరించి దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చాంగోను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అతడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 13న అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 308(4), 329(4), 352 సెక్షన్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25(1)(A) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కేసు దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు కలిసి నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. చివరకు చాంగోను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి నాలుగు కత్తులు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఆటో డ్రైవర్ దారుణ హత్య
Hyderabad Crime: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. బండ్లగూడలోని జహంగీర్‌బాద్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రవూఫ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలీనగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ రవూఫ్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు? హత్యకు అసలు కారణం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించే అవకాశం ఉంది.మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే రోజు రెండో హత్యగా స్థానికంగా ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. వరుస హత్యల ఘటనలతో అలీనగర్, బండ్లగూడ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వ్యాపారి ఇంట్లో వజ్రాభరణాలు మాయం!
Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వరుస చోరీయత్నాలు కలకలం రేపుతున్నాయి. రోడ్ నంబర్ 10 పరిధిలో పక్కపక్కనే ఉన్న మూడు ఇళ్లను ఓ అగంతకుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత ప్లాట్ నంబర్ 153లో చోరీకి ప్రయత్నించిన అగంతకుడు.. అనంతరం ప్లాట్ నంబర్ 154లోని వ్యాపారి షీతల్ బాంగర్ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అయితే ఇంటి యజమాని నిద్రలేవడంతో అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

అనంతరం ప్లాట్ నంబర్ 147లోని వ్యాపారి శైలేందర్ సింగ్ ఇంట్లోకి అగంతకుడు చొరబడి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోని కప్‌బోర్డులో దాచిన విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను అపహరించినట్లు ఫిర్యాదు అందింది. చోరీకి గురైన వాటిలో ఎమరాల్డ్ వజ్రపు ఉంగరం, రెండు బ్రాస్లెట్లు, నెక్లెస్, చెవి కమ్మలు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఎమరాల్డ్ నెక్లెస్, మరో బంగారు నెక్లెస్‌తో పాటు మరికొన్ని విలువైన ఆభరణాలు కూడా మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని శైలేందర్ సింగ్ సతీమణి నీలూ కౌర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆయా ఇళ్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీ ఆధారంగా అగంతకుడి కదలికలను పరిశీలిస్తూ అతడి కోసం గాలిస్తున్నారు. షీతల్ బాంగర్ ఫిర్యాదుపై కూడా మరో కేసు నమోదు చేశారు. వరుసగా ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీకి యత్నించడం, ఓ ఇంట్లో భారీగా ఆభరణాలు అపహరణకు గురికావడంతో జూబ్లీహిల్స్‌లోని స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
Husband Blackmail: హైదరాబాద్‌ ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భార్యను ప్రైవేట్‌ ఫొటోలు, వీడియోలతో బెదిరిస్తూ వేధిస్తున్నాడనే ఆరోపణలపై భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. బసవతారకంనగర్‌కు చెందిన 24 ఏళ్ల టీచర్‌ తన భర్త నిరంతరం వేధిస్తూ, తన ప్రైవేట్‌ ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి వైరల్‌ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. 2022లోనే తన ప్రైవేట్‌ ఫొటోలను దుర్వినియోగం చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడని, అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త నుంచి నిరంతరం వేధింపులు ఎదురవుతున్నాయని, ప్రైవేట్‌ ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.1 కోటి స్వాహా
Hyderabad Crime: హైదరాబాద్‌లో గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు దోచుకున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మిస్తూ, ముందుగా గుంతలు తవ్వి అందులో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టేవారు. అనంతరం తాము చెప్పిన విధంగా ప్రత్యేక పూజలు చేస్తే ఆ బొగ్గు క్రమంగా బంగారంగా మారుతుందని నమ్మించి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవారు. ఇలా మొత్తం 11 మందిని మోసం చేసి సుమారు రూ.1 కోటి వరకు స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ముఠాలో మహ్మద్ మునవ్వర్ (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడైన మునవ్వర్ గతంలో కారు మెకానిక్, పెయింటర్‌గా పనిచేసేవాడని, వచ్చే ఆదాయంతో జీవనం సాగించడం కష్టంగా ఉండటంతో స్నేహితులతో కలిసి గుప్త నిధుల పేరుతో మోసం చేయాలని పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, 25 డూప్లికేట్ గోల్డ్ కాయిన్స్‌తో పాటు పూజా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధులు, బంగారం పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌లో మహిళలు, చిన్నారులపై దారుణాలు.. రెండేళ్లలో 5,370 కేసులు
Hyderabad Crime: విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్‌లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 2024, 2025 సంవత్సరాల్లో కలిపి 2,353 అత్యాచార కేసులు నమోదైనట్లు పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి 3,017 పోక్సో కేసులు నమోదయ్యాయి. అంటే రెండేళ్ల వ్యవధిలో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించి మొత్తం 5,370 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

పోలీసుల గణాంకాల ప్రకారం 2024, 2025 సంవత్సరాల్లో నమోదైన అత్యాచార కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 989 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 650 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 714 కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి అత్యాచార కేసుల సంఖ్య 2,353కు చేరింది. మహిళలపై నేరాలను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్యపై ఆందోళన వ్యక్తమవుతోంది.

చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించిన పోక్సో కేసుల సంఖ్య కూడా భారీగా ఉంది. 2024, 2025 సంవత్సరాల్లో నమోదైన పోక్సో కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 1,249 కేసులు, మల్కాజిగిరి పరిధిలో 908 కేసులు, సైబరాబాద్ పరిధిలో 860 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 3,017 పోక్సో కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్నారులపై జరుగుతున్న నేరాల తీవ్రతను ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక 2024లో నమోదైన కేసుల్లో 73 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదైనట్లు పేర్కొంటున్నారు. నగరం విస్తరిస్తున్న కొద్దీ మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పలువురు కోరుతున్నారు.

మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీసుల నిఘా పెంచడం, సున్నిత ప్రాంతాల్లో పర్యవేక్షణను మరింత విస్తరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కుటుంబాలు, విద్యాసంస్థలు, పోలీసులు, సమాజం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. గణాంకాల నేపథ్యంలో హైదరాబాద్‌లో మహిళలు, చిన్నారుల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

అత్యాచార కేసులు (2024–25):

హైదరాబాద్: 989

సైబరాబాద్: 650

రాచకొండ: 714

మొత్తం: 2,353

పోక్సో కేసులు (2024–25):

హైదరాబాద్: 1,249

మల్కాజిగిరి: 908

సైబరాబాద్: 860

మొత్తం: 3,017

9 నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య చేసిన తల్లి.. ఎల్‌బీనగర్‌లో విషాదం
Hyderabad Crime: హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బైరామల్‌గూడ చెరువులో 9 నెలల చిన్నారిని ఆమె తల్లే ముంచి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంజాపూర్‌కు చెందిన లోకసాని రాజేశ్వరి (34) తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక దర్యాప్తులో ఘటన సమయంలో నిందితురాలు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, చిన్నారిపై ఇంతటి అమానుషానికి పాల్పడిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.