Ranga Reddy - Vishvambhara News

ఆదిబట్ల పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.. చోరీల ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్
Adibatla Police: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ డివిజన్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ఇంటి దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు ఒక అంతర్రాష్ట్ర ఇంటి దొంగతో పాటు ఇద్దరు బైక్ చోరీ నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.6.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్, ఒక మోటార్‌సైకిల్‌తో పాటు చోరీకి గురైన ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అనేక చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పథకం ప్రకారం ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విలువైన నగలు, వస్తువులను అపహరించడంతో పాటు బైక్‌లను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తును బాధితులకు అప్పగించే ప్రక్రియను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కేసు వివరాలను ఆదిబట్ల డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక నిఘా, పెట్రోలింగ్‌ను మరింత పెంచామని, చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.