Anantapur - Vishvambhara News

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
Anantapur Private Travels Bus Fire: అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు కనిపించడంతో కొంతసేపు అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

బస్సులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రయాణికులను వెంటనే కిందకు దించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు ఎలా చెలరేగాయనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బస్సులో సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగాయా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

అనంతపురం వాసులకు శుభవార్త.. HPCL నుంచి స్మార్ట్ అండ్ సేఫ్ 'హెచ్‌పీ నవ్య' సిలిండర్ ఆవిష్కరణ
HP Navya Cylinder: అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట గ్రామంలోని శ్రీ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయంలో హెచ్‌పీసీఎల్‌ నూతనంగా ప్రవేశపెట్టిన ‘హెచ్‌పీ నవ్య’ గ్యాస్ సిలిండర్‌ను ఘనంగా లాంచ్ చేశారు. హెచ్‌పీసీఎల్ చీఫ్ రీజినల్ మేనేజర్ పంకజ్ కుమార్, ప్లాంట్ మేనేజర్ అవినాష్, సేల్స్ ఆఫీసర్ ఎం.ఏ. అశిం, మేనేజర్ కే. వికాస్ రెడ్డి తదితర అధికారులు కార్యక్రమంలో పాల్గొని సిలిండర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఇప్పటికే బెంగళూరులో ప్రారంభించిన ఈ నూతన సిలిండర్‌ను తాజాగా అనంతపురంలోనూ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా చీఫ్ రీజినల్ మేనేజర్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని హెచ్‌పీ నవ్య సిలిండర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. సిలిండర్‌లో ఎంత మేర గ్యాస్ ఉందో సులభంగా తెలుసుకునే విధంగా దీని రూపకల్పన చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా మహిళలు సైతం పెద్దగా శ్రమ పడకుండా సిలిండర్‌ను సులభంగా ఒక చోటు నుంచి మరోచోటుకు మార్చుకునేలా తేలికగా రూపొందించినట్లు వివరించారు. వినియోగ సమయంలో ప్రమాదాల అవకాశాలను తగ్గించేలా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

హెచ్‌పీ నవ్య సిలిండర్‌ వినియోగదారులకు వేగవంతమైన డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని పంకజ్ కుమార్ తెలిపారు. బుకింగ్ చేసిన తర్వాత సుమారు 90 నిమిషాల్లోనే సిలిండర్‌ను ఇంటి వద్దకు చేరేలా సేవలను అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నవ్య సిలిండర్ బుకింగ్ కోసం హెచ్‌పీసీఎల్ ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, వినియోగదారులు ఆ యాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. హెచ్‌పీ నవ్య సిలిండర్ రీఫిల్ ధర రూ.1,739గా ఉంటుందని వెల్లడించారు. అనంతపురం నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ నూతన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?
Anantapur Collectorate: అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఓ మహిళా ఉద్యోగి విధి నిర్వహణ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను నమోదు చేయాల్సిన సమయంలో సదరు ఉద్యోగి సెల్‌ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలు చూస్తూ మరో ఉద్యోగితో ముచ్చట్లు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రీవెన్స్‌ కార్యక్రమానికి వస్తుంటే.. వారికి సహకరించాల్సిన సిబ్బంది విధుల సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై వార్తా కథనాలు వెలువడి నాలుగు రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియో ఇదిగో.......

విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై జిల్లా కలెక్టర్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే గ్రీవెన్స్‌ కార్యక్రమంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా.. బాధితులను పట్టించుకోకుండా వ్యక్తిగత విషయాల్లో నిమగ్నం కావడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అంటున్నారు. గతంలోనూ కలెక్టరేట్‌ సిబ్బంది విధి నిర్వహణపై విమర్శలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉచిత బర్త్, డెత్ సర్టిఫికెట్లకు రూ.40 వసూలు.. అనంతపురం మున్సిపల్ ఆఫీస్‌లో కలకలం
Anantapur Municipal Office: అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువీకరణ విభాగంపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన బర్త్, డెత్ సర్టిఫికెట్లను సాయినగర్ జీరో క్రాస్‌లోని ఓ నెట్ సెంటర్‌లో డబ్బులు తీసుకుని ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో సర్టిఫికెట్ పేపర్‌కు రూ.40 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ కార్యాలయంలో జారీ కావాల్సిన సర్టిఫికెట్లు బయట నెట్ సెంటర్‌కు ఎలా వెళ్తున్నాయనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్ PDF ఫైళ్లను నెట్ సెంటర్‌కు పంపిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయం నుంచి ఒరిజినల్ ఫైళ్లు నెట్ సెంటర్‌కు వెళ్తున్నాయా? ప్రభుత్వ కార్యాలయంలో ఉచితంగా అందించాల్సిన సర్టిఫికెట్లకు బయట డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఓ మరణ ధ్రువీకరణ పత్రం విషయంలో అధికారి మధ్యవర్తి ద్వారా డబ్బులు అడిగినట్లు బాధితుడు తెలిపినట్లు సమాచారం. సర్టిఫికెట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డబ్బులు ఇచ్చినట్లు బాధితుడు వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై గతంలో కూడా కథనాలు వెలువడినప్పటికీ అధికారులు స్పందించలేదని బాధితులు, స్థానికులు చెబుతున్నారు. ఆగస్టు 18న వి3 న్యూస్ ఛానల్‌కు చెందిన విలేఖరి ఈ అంశంపై విశ్వంభర వెబ్‌సైట్‌లో కథనం ప్రచురించారు. అనంతరం ఈ కథనాన్ని ఫేక్ న్యూస్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని వి3 న్యూస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియోలతో పాటు పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వి3 న్యూస్ ఛానల్, వి3 విలేఖరి స్పష్టం చేస్తున్నారు. ఆ ఆధారాలను పరిశీలించి వాస్తవాలను బయటకు తీసుకురావాలని కోరుతున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో మరో కథనంతో మీ ముందుకు వస్తుంది.

వీడియో ఫ్రూఫ్‌ ఇదిగో...👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ప్రకటనలకే పరిమితమైన అభివృద్ధి.. బోయలపల్లి బడిలో రెండు గదుల్లో ఐదు తరగతులు
Boylapalli Government School: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోయలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కొరత విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారింది. పాఠశాలలో కేవలం రెండు తరగతి గదులు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా.. 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 28 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీంతో రెండు గదుల్లో ఒక గదిలో రెండు తరగతులు, మరో గదిలో ఏకంగా మూడు తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే గదిలో వేర్వేరు తరగతులకు చెందిన విద్యార్థులకు ఒకేసారి బోధించడంతో పాఠాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, డెస్కులు కూడా లేకపోవడంతో నేలపైనే కూర్చొని పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఉపాధ్యాయులు, ఫర్నిచర్‌ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనీస మౌలిక వసతులు కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్థులు అంటున్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పేపర్‌ ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని, గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మాత్రం దృష్టి కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బోయలపల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన బెంచీలు, డెస్కులు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

దారి కోసం రైతుపై ఒత్తిడి.. ఎస్సై, ఎమ్మార్వో ముందే శివయ్య ఆత్మహత్యాయత్నం
Anantapuram Farmer Suicide Attempt: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం సంజీవపురం గ్రామానికి చెందిన రైతు శివయ్య పట్టా భూమిలో దారి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన పట్టా భూమిలో దారి కోసం గార్లదిన్నె ఎస్సై, ఎమ్మార్వో అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని, దారి ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారని రైతు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక ఎస్సై, ఎమ్మార్వో సమక్షంలోనే శివయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వెంటనే ఆయనను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎస్సై , ఎమ్మార్వో ముందే శివయ్య ఆత్మహత్యాయత్నం 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

రైతులకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు తమపై ఒత్తిడి తీసుకురావడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని శివయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టా భూమిలో దారి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారని, దారి ఇవ్వకపోతే కేసులు పెడతామని హెచ్చరించారని చెప్పారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుల అండదండలతోనే అధికారులు రైతుపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కేసు నమోదు చేయలేదని, దుర్భాషలాడి వెనక్కి పంపించారని వారు తెలిపారు.

తమ పొలంలోనే తమపై దాడి చేసి తాళిబొట్లు తెంపిన ఘటనను కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని రైతు బంధువులు తెలిపారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకుండా తమను తిట్టి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు శివయ్య ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్వో, ఎస్సై వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతు శివయ్యకు ఏదైనా జరిగితే ఎమ్మార్వో, ఎస్సైలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. పట్టా భూమి దారి వివాదాన్ని వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
Anantapuram Sri Chaitanya School: అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆదిమూర్తి నగర్‌లో ఉన్న శ్రీ చైతన్య సిక్స్త్ బ్రాంచ్‌లో పుస్తకాల విక్రయాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయించి, వాటిని విద్యార్థుల ఇళ్లకు, పాఠశాలకు లేదా ఉపాధ్యాయుల ఇళ్లకు తెప్పించి అక్కడి నుంచి విద్యార్థులకు అందజేస్తున్నారని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి మెటా యాప్ పేరుతో సుమారు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి చదువుతున్న చిన్నారికి ఫోన్, మెటా యాప్‌తో ఏం పని ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల అవసరాల పేరుతో అదనపు యాప్‌లు, పుస్తకాలు, ఇతర సామగ్రిని తప్పనిసరి చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, బెల్టులు తదితర వస్తువులను పాఠశాలలే విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించిందా? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై గతంలో కూడా పలు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతపురం ఎంఈఓ, డీఈఓ అధికారులు స్పందించి పాఠశాలలో జరుగుతున్న పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి విక్రయాలపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించి సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

వేధింపులు వల్లే నా భర్త మృతి..కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు
Anantapuram News: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అనంతసాగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. తన భర్త శ్యాముల్ శ్రీనివాస్ మృతికి అరుణకుమారి, దివాకర్తో పాటు మరికొందరి వేధింపులే కారణమని ఆయన భార్య సావిత్రి ఆరోపణలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, న్యాయం కోసం పోరాడుతూ చివరకు తన భర్తను కోల్పోయానంటూ కన్నీరుమున్నీరయ్యారు.

సావిత్రి కథనం ప్రకారం.. తన భర్త తమ్ముడు శ్రీకాంత్ బ్యాంకు రుణం పేరుతో సుమారు రూ.5 లక్షలు తీసుకున్నాడని, అనంతరం అతని భార్య అరుణకుమారి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మరో రూ.2.20 లక్షలు తీసుకుందని తెలిపారు. ఇలా మొత్తం రూ.7.20 లక్షలు తీసుకున్నప్పటికీ తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ మృతి చెందిన తర్వాత కూడా అరుణకుమారి డబ్బులు ఇస్తానని చెబుతూ కాలయాపన చేస్తూ, తమను మానసికంగా వేధించిందని వాపోయారు.

ఇటీవల బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌లో అరుణకుమారితో పాటు దివాకర్, పుష్పరాజు, టీటీ వెంకటేశు, సుభాను, సైకిల్ షాప్ ఇస్మాయిల్ తదితరులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని సావిత్రి ఆరోపించారు. ఆ బెదిరింపులు, అవమానాలు, మానసిక ఒత్తిడి కారణంగానే తన భర్త తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మృతికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.

ఎస్సీ నియోజకవర్గంలోనే ఎస్సీలకు తాగునీటి కష్టాలు.. నడిమిదొడ్డి వాసుల ఆవేదన
Nadimidoddi News: అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామంలోని ఎస్సీ కాలనీలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. తాగడానికి స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేకపోవడంతో పొలాల్లోని నీటినే తెచ్చుకుని తాగాల్సిన దుస్థితి నెలకొందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గానికి ఎస్సీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, తమకు కనీస తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని గ్రామస్తులు వాపోయారు.

గ్రామంలో నెలలుగా తాగునీటి సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే పరిస్థితి ఉండేదని, ప్రభుత్వం మారితే తమ సమస్యలు తీరుతాయని ఆశించామని, కానీ ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

తాగడానికి సరైన నీరు లేకపోవడంతో వ్యవసాయ పొలాల్లో ఉన్న నీటినే వినియోగించాల్సి వస్తోందని గ్రామస్తులు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలుషిత నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, అయినప్పటికీ ప్రత్యామ్నాయం లేక అదే నీటిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి నడిమిదొడ్డి ఎస్సీ కాలనీలో శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కోరారు.

ఎస్సీల భూమి ఆక్రమించారంటూ వీఆర్వోపై ఆరోపణలు.. కలెక్టరేట్ వద్ద నిరసన
Anantapur News: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాయి. గ్రామానికి చెందిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 276లోని ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిందని, అయితే అదే భూమిని స్థానిక వీఆర్వో కుమారస్వామి తన భార్య పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ భూమిలో సుమారు 200 మంది ఎస్సీ కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇవ్వాల్సి ఉండగా, తమ హక్కులను కాలరాశారని వాపోయారు.

ఈ సమస్యపై గత రెండేళ్లుగా బుక్కరాయసముద్రం తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో చివరి మార్గంగా అనంతపురం కలెక్టరేట్‌కు చేరుకుని తప్పట్లు కొడుతూ నిరసన తెలుపుతూ తమ గోడును వినిపించారు. వీఆర్వో కుమారస్వామిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా జరిగిందని ఆరోపిస్తున్న భూ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, ఎస్సీలకు కేటాయించిన భూమిని తిరిగి వారికి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

అనంతపురం హాస్టల్‌లో దారుణం.. ఇద్దరు విద్యార్థినులపై బ్లేడుతో దాడి
Anantapur: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ వసతి గృహంలో విద్యార్థుల మధ్య జరిగిన ఒక ఘటన సంచలనంగా మారింది. హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని అర్ధరాత్రి వేళ తోటి ఇద్దరు విద్యార్థినులపై బ్లేడుతో దాడి చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విడపనకల్లు గ్రామానికి చెందిన సుస్మిత, సోఫియా అనే విద్యార్థినులు హాస్టల్‌లో ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. గురువారం రాత్రి వీరు నిద్రపోతున్న సమయంలో అదే హాస్టల్‌కు చెందిన మరొక విద్యార్థిని బ్లేడుతో వారి గొంతు కోయడానికి ప్రయత్నించింది. అయితే బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరు బాలికల గొంతు వద్ద స్వల్ప గాయాలయ్యాయి.

ఈ సంఘటన అనంతరం గాయపడిన బాలికలకు ఆసుపత్రిలో సరైన వైద్య సహాయం అందించకపోవడంతో పాటు, విషయాన్ని కప్పిపుచ్చేందుకు హాస్టల్ వార్డెన్ ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల తల్లిదండ్రులకు సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.  ఇతర మార్గాల ద్వారా విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్‌కు చేరుకుని పాఠశాల యజమాన్యం, వార్డెన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో చదువుకునే పిల్లల రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు ఎమ్మెల్యే సార్?.. ఎర్రడికేర వాసుల ఆగ్ర‌హం..
Kalyandurg News: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం ఎర్రడికేర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి దాదాపు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక దయనీయ స్థితికి చేరుకుంది. గుంతలు, రాళ్లు, దుమ్ముతో నిండిపోయిన ఈ రహదారిపై ప్రయాణించడం నిత్యకృత్యంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రహదారి పరిస్థితి 'పెద్ది' సినిమాలో చూపించిన గ్రామీణ దృశ్యాలను తలపిస్తోందని స్థానికులు అంటున్నారు.

గ్రామస్తుల కథనం ప్రకారం, ఈ రహదారిని 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించగా, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చే నాయకులు రహదారి సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ, గెలిచిన తర్వాత గ్రామం వైపు కూడా చూడడం లేదని మండిపడుతున్నారు.

ప్రస్తుతం గ్రామంలో విద్యార్థులు, రైతులు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇలాంటి సమస్యలు ఒక్క ఎర్రడికేర గ్రామానికే పరిమితం కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

"రహదారులే సరిగా లేని గ్రామాలకు సైకిళ్లు పంపిణీ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?" అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఎర్రడికేరతో పాటు నియోజకవర్గంలోని దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు మరమ్మతులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.