Daggupati MLA - Vishvambhara News

అనంతపురంలో తల్లికి వందనం కార్యక్రమం.. ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం: ఎమ్మెల్యే దగ్గుపాటి
Anantapuram News: అనంతపురం అర్బన్ పరిధిలోని శారద స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి, అనంతపురం మున్సిపల్ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పథకం అమలు తీరును వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఒక కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకరికే పథకం వర్తించేదని, ప్రస్తుతం ఆ పరిమితిని తొలగించి ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.